ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
- సోనీ భారత్‌లో 115-అంగుళాల BRAVIA 9 II True RGB 4K TVను విడుదల
- RGB Backlight Master Drive Pro టెక్నాలజీతో మరింత సహజమైన రంగులు, మెరుగైన కాంట్రాస్ట్
- 115-అంగుళాల 4K LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10, HLG, Dolby Vision సపోర్ట్.
- XR Processorతో మెరుగైన పిక్చర్ ప్రాసెసింగ్.
- 12 స్పీకర్ల Acoustic Multi-Audio+ సిస్టమ్‌తో 85W ఆడియో అవుట్‌పుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony BRAVIA 9 II: సోనీ ఇండియా (Sony India) భారత మార్కెట్లో 115-అంగుళాల (292 సెం.మీ.) BRAVIA 9 II True RGB టీవీని విడుదల చేసింది. దీంతో సోనీ True RGB BRAVIA టీవీల శ్రేణి ఇప్పుడు 55 అంగుళాల నుంచి 115 అంగుళాల వరకు పెంచుకుంది. అత్యాధునిక డిస్ప్లే టెక్నాలజీ, శక్తివంతమైన ఆడియో, గేమింగ్ ఫీచర్లు, Google TV వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ టీవీని లాంచ్ చేసింది.
True RGB టెక్నాలజీ:
ఈ కొత్త BRAVIA 9 II టీవీలో సోనీ అభివృద్ధి చేసిన RGB బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రో (RGB Backlight Master Drive Pro) టెక్నాలజీని ఉపయోగించారు. ఇది రెడ్, గ్రీన్, బ్లూ LEDలను స్వతంత్రంగా నియంత్రించడం ద్వారా మరింత సహజమైన రంగులు, లోతైన కాంట్రాస్ట్, మెరుగైన బ్రైట్నెస్, స్మూత్ కలర్ గ్రాడేషన్ను అందిస్తుంది. అలాగే X-Wide Angle Pro టెక్నాలజీ వల్ల ఏ కోణం నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. ఇందులో ల్యూమినెన్స్ బూస్టర్ ప్రో, XR క్లియర్ ఇమేజ్, XR కాంట్రాస్ట్ బూస్టర్ 40, స్మూత్ కలర్ గ్రేడేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
4K 120Hz డిస్ప్లే:
ఈ టీవీలో 115-అంగుళాల (114.5-అంగుళాల) 4K LCD ప్యానెల్ ను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, లోకల్ డిమ్మింగ్, HDR10, HLG, డాల్బీ విజన్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీకి XR Processor శక్తినిస్తుంది.
12 స్పీకర్లతో థియేటర్ అనుభవం:
BRAVIA 9 II 115-అంగుళాల మోడల్లో Acoustic Multi-Audio+ సిస్టమ్‌ను అందించారు. ఇందులో మొత్తం 12 స్పీకర్లు (2 సబ్వూఫర్లు, 8 ఫుల్-రేంజ్ స్పీకర్లు, 2 ట్వీటర్లు) ఉన్నాయి. మొత్తం 85W ఆడియో అవుట్‌పుట్ తోపాటు డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో, DTS సపోర్ట్ కూడా ఉంది. టీవీ Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో సినిమాలు, టీవీ షోలు, యాప్‌లు, గేమ్‌లను ఒకే ఇంటర్ఫేస్లో యాక్సెస్ చేయవచ్చు.
ఇందులోని ముఖ్యమైన స్మార్ట్ ఫీచర్లు:
* 32GB స్టోరేజ్
* బిల్ట్-ఇన్ మైక్రోఫోన్
* వాయిస్ సెర్చ్
* Chromecast Built-in
* Apple AirPlay
* Apple HomeKit
* అలాగే భవిష్యత్తులో OTA అప్డేట్ ద్వారా Gemini for Google TV కూడా అందుబాటులోకి రానుంది.
గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లు:
PS5, హైఎండ్ గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టీవీలో HDMI 2.1, 4K @ 120Hz, VRR (Variable Refresh Rate), ALLM (Auto Low Latency Mode), eARC, Auto HDR Tone Mapping, Auto Genre Picture Mode వంటి ఫీచర్లను అందించారు.
ధరలు:
* BRAVIA 7 II 55-అంగుళాలు –> రూ.2,21,990
* BRAVIA 9 II 75-అంగుళాలు –> రూ.5,39,990
* BRAVIA 9 II 85-అంగుళాలు –> రూ.6,69,990
* BRAVIA 9 II 115-అంగుళాలు –> రూ.28,99,990 (త్వరలో అందుబాటులోకి రానుంది)
Sony BRAVIA True RGB టీవీలను సోనీ సెంటర్, సోనీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ShopatSC, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్లు, అలాగే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?