NTV Telugu Site icon

Smart Phones : మొబైల్ పౌచ్ లో ఇలాంటి పెడితే ఇక అంతే.. ఫోన్ పేలిపోవడం ఖాయం..

phones

phones

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరు లేరు.. చదువుతో, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు. దాంతో అందరు కూడా మార్కెట్ లోకి వచ్చిన ఫోన్లను కోనేస్తున్నారు.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంటారు. చాలా మందికి ఫోన్‌ లేకపోతే.. సమస్తం కోల్పోయినట్లుగా ఫీలవుతారు. ఫోన్ ఉంటే చాలు.. తమకు ఏదీ అవసరం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కొద్ది.. అన్ని పనులు ఒక్క సెల్ ఫోన్‌తోనే చేసేయానికి వీలుపడుతుంది. షాపింగ్ అయినా.. ఈటింగ్ అయినా.. ఏదైనా ఫోన్ తోనే అవుతున్నాయి.. దాంతో వీటికి డిమాండ్ కూడా పెరిగిపోయింది..

అయితే ఫోన్ ను సేఫ్ గా ఉంచేందుకు అందరు రకరకాల పౌచ్ లను వాడుతారు.. కొందరు మాత్రం ఈ సేఫ్టీ పౌచ్‌ను కూడా పర్స్‌ మాదిరిగా యూజ్ చేస్తారు.. పౌచ్ ను చాలా మంది ఫోన్ కవర్ వెనుక భాగంలో కరెన్సీ నోట్లు గానీ, కాయిన్స్ గానీ, బ్యాంకుకు సంబందించిన కార్డులను పెడుతుంటారు. పౌచ్‌లో వీటిని దాచి ఉంచడం వలన అవి సేఫ్‌గా ఉంటాయని భావిస్తారు. అలాగే, అత్యవసర సమయంలోనూ ఈ ఇవి పనికోస్తాయని అనుకుంటారు.. అదే పెద్ద పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు..

అయితే వీటిలో ఫోన్లో ఏది ఉన్నా కూడా ఫోన్ పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు..నోట్లను కాగితంతో తయారు చేస్తారు. ఇందుకోసం అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ వేడెక్కినప్పుడు, ఆ కరెన్సీ నోటు కారణంగా వేడి బయటకు వెల్లదు.. అలాగే కార్డులను కూడా ఫోన్ వెనక పెట్టుకుంటే ఆ వేడికి కొన్నిసార్లు పేలే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కార్డు లపై ఉండే చిప్ పనిచేయకుండా పోతుందని, ముఖ్యమైన కార్డు అని అస్సలు పెట్టుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు.. కాయిన్స్ లేదా ఏ వస్తువును కూడా అక్కడ పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు… ఇలాంటి వల్లే ప్రమాదం జరుగుతాయని చెబుతున్నారు.. జాగ్రత్త..