SIM Card: సిమ్ కార్డు కొనాలనుకుంటున్నారా? మారిన కొత్త రూల్స్ తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల రూల్స్ మారుతాయి.. పలు వాటిల్లో కొన్ని రూల్స్ మారాయి.. దాంతో పాటుగా కొత్త సిమ్ తీసుకోవడంలో కూడా కొన్ని కీలక మార్పులు జరిగాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టెలికాం రంగంలో పెను మార్పు చోటు చేసుకోనున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సిమ్ కార్డ్‌లను విక్రయించే నిబంధనలను మార్చనున్నట్లు గతంలో ప్రకటించింది.. ఇక నుంచి కొత్త సిమ్ తీసుకోవాలని అనుకొనేవారు కొన్ని నియమాలను తప్పక పాటించాలి..ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. దేశంలో పెరుగుతున్న సిమ్ కార్డ్ మోసాల రేటును అరికట్టడానికి గవర్నమెంట్ ఈ కఠినమైన చర్యలను తీసుకున్నట్లు తెలుస్తుంది..
నకిలీ సిమ్‌కార్డుల విక్రయాలను నిరోధించేందుకు అమ్మకందారుల కోసం ఈ నిబంధనను తీసుకురాగా, ఇది కొనుగోలుదారులపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా కాలంగా వస్తున్న ఫిర్యాదులకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. దేశంలో రోజురోజుకు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్ కార్డులు అమ్ముడుపోతున్నాయి.. కొన్ని సిమ్ కార్డులు వేరే వారి పేరు మీద ఉండటంతో సిమ్‌కార్డుల విక్రయాన్ని కఠినంగా నిర్వహించగలిగితే ఇలాంటి మోసాలు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది..
Also Read
- Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
- Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
ఇకపోతే సిమ్ విక్రేత తన షాప్ సిబ్బంది మొత్తం సమాచారాన్ని రికార్డ్ చేయాలి. షాపు సిబ్బంది కూడా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. DoT కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి సిమ్ కార్డ్ దుకాణానికి కార్పొరేట్ ఐడీ నంబర్ లేదా సీఐఎన్ నంబర్ జారీ చేయబడుతుంది. ఈ ఎమర్జెన్సీ నంబర్ లేకుండా ఎవరూ సిమ్ కార్డ్‌ని విక్రయించలేరు. ఇప్పుడు ఒక రిటైల్ స్టోర్ DoT కింద నమోదు చేసుకోవడానికి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, జీఎస్టీ వివరాలను అందించాలని తెలిపింది..
ముందుగా రిజిస్టర్ చేసుకోకుంటే సిమ్ ను తీసుకోలేరు.. ఈ రిజిస్ట్రేషన్ లేకుండా దుకాణాదారులు సిమ్ కార్డ్‌లను విక్రయిస్తే, దాని ID బ్లాక్ చేయబడుతుంది. అంతే కాకుండా దుకాణదారునికి జరిమానా విధిస్తారు. అలాగే ఒక వ్యక్తి సిమ్ కార్డును పోగొట్టుకున్నా లేదా సిమ్ కట్ చేసినా, అతను వెరిఫికేషన్ ప్రక్రియకు వెళ్లాలి. జియో, ఎయిర్‌టెల్, వి, బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డులను విక్రయించడానికి ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది… సో ఇక సిమ్ తీసుకోవాలని అనుకొనేవారు ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!