Site icon NTV Telugu

పోర్టబుల్ ప్రొజెక్టర్‌లో కొత్త చాప్టర్.. AI ఫీచర్లతో Samsung The Freestyle+ గ్లోబల్ లాంచ్..!

Samsung The Freestyle+

Samsung The Freestyle+

Samsung The Freestyle+: శాంసంగ్ (Samsung) ఎలక్ట్రానిక్స్ తన తాజా AI ఆధారిత పోర్టబుల్ ప్రొజెక్టర్ ‘The Freestyle+’ను గ్లోబల్‌గా విడుదల చేసినట్లు ప్రకటించింది. లాస్ వెగాస్‌లో జరగనున్న CES 2026కు ముందుగానే ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది గతంలో వచ్చిన ఫ్రీస్టైల్ (Freestyle) డిజైన్‌ను ఆధారంగా చేసుకుని, అధునాతన AI స్క్రీన్ ఆప్టిమైజేషన్, మరింత బ్రైట్‌నెస్ అండ్ భారీ విస్తృతమైన ఇన్‌బిల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లతో అప్డేట్ అయ్యింది. తక్కువ సెటప్‌తో విభిన్న ప్రదేశాల్లో ఉపయోగించేలా ఈ ప్రొజెక్టర్‌ను రూపొందించారు.

50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Moto X70 Air Pro లాంచ్‌కు రెడీ..!

The Freestyle+లో AI OptiScreen టెక్నాలజీని ఉపయోగించారు. ఇది శాంసంగ్ అభివృద్ధి చేసిన AI ఆధారిత స్క్రీన్ ఆప్టిమైజేషన్ సిస్టమ్. ప్రొజెక్షన్ జరుగుతున్న వాతావరణాన్ని గుర్తించి, గోడ లేదా ఉపరితలానికి అనుగుణంగా పిక్చర్‌ను సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల మాన్యువల్ క్యాలిబ్రేషన్ అవసరం లేకుండా మెరుగైన వీక్షణ అనుభూతి లభిస్తుంది. చూసే అనుభూతిని Vision AI Companion మరింత మెరుగుపరుస్తుంది. ఇది శాంసంగ్ కు చెందిన పర్సనలైజ్డ్ AI ప్లాట్‌ఫామ్. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన Bixbyతో పాటు గ్లోబల్ AI పార్ట్‌నర్ సేవలు పనిచేస్తాయి.

ఇందులో ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే..ఇది మూలలు, తెరలు లేదా వంకర గోడలపై ప్రొజెక్షన్ చేసినప్పుడు వచ్చే డిస్టార్షన్‌ను ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది. ఇంకా ప్రొజెక్టర్ కదలిక లేదా రోటేషన్ సమయంలో కూడా ఫోకస్‌ను నిరంతరం సర్దుబాటు చేస్తూ స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. కంపాటిబుల్ స్క్రీన్ యాక్సెసరీతో ఉపయోగించినప్పుడు ప్రొజెక్షన్ ప్రాంతానికి అనుగుణంగా చిత్ర పరిమాణాన్ని ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. ప్రొజెక్షన్ ఉపరితలం రంగు లేదా ప్యాటర్న్‌ను విశ్లేషించి, చూసే సమయంలో దృశ్య అవాంతరాలను తగ్గిస్తుంది.

Nilakanta : మాస్టర్ మహేంద్రన్ ‘నీలకంఠ’ రివ్యూ

పోర్టబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చిన కాంపాక్ట్ సిలిండ్రికల్ డిజైన్ తో దీనిని The Freestyle+ను రూపొందించారు. దీని ద్వారా ఒక గది నుంచి మరో గదికి లేదా బయట ప్రదేశాలకు సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ ప్రొజెక్టర్ 430 ISO లూమెన్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అలాగే 180-డిగ్రీ రోటేటింగ్ డిజైన్ వల్ల గోడలు, నేల లేదా పైకప్పుపై కూడా ప్రొజెక్షన్ చేయవచ్చు. The Freestyle+లో శాంసంగ్ టీవీ ప్లస్, సర్టిఫైడ్ OTT ప్లాట్‌ఫారమ్‌లు, శాంసంగ్ గేమింగ్ హబ్ కు ఇన్‌బిల్ట్ యాక్సెస్ ఉంది. దీంతో ఎలాంటి ఎక్స్‌టర్నల్ డివైస్‌లను కనెక్ట్ చేయకుండానే స్ట్రీమింగ్, గేమింగ్ చేయవచ్చు.

ఆడియో కోసం ఇందులో 360-డిగ్రీ బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంది. అలాగే కంపాటిబుల్ శాంసంగ్ సౌండ్‌బార్‌లతో Q-Symphony సపోర్ట్ ద్వారా సింక్‌డ్ ఆడియో అనుభూతిని అందిస్తుంది. దీనిని Samsung Electronics CES 2026 (జనవరి 6 నుంచి 9 వరకు, లాస్ వెగాస్)లో The Freestyle+ను ప్రదర్శించనుంది. ఈ ప్రొజెక్టర్‌ను 2026 తొలి అర్ధభాగంలో దశలవారీగా గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Exit mobile version