NTV Telugu Site icon

Samsung: ‘‘మడత పెట్టినప్పుడు చెప్పండి’’..ఆపిల్ ఐఫోన్ 16పై సామ్‌సంగ్ సెటైర్లు..

Iphonr 16

Iphonr 16

Samsung: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16ని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తెచ్చింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ 16 మ్యాక్స్‌తో పాటు కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ని రిలీజ్ చేసింది.

Read Also: Indian Air Force: ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై వింగ్ కమాండర్‌ అత్యాచారం.. ఆరోపణలపై ఇంటర్నల్ ఎంక్వైరీ..

ఇదిలా ఉంటే, ఆపిల్ ప్రత్యర్థి మరో మొబైల్ దిగ్గజం సామ్‌సంగ్ ఐఫోన్ 16పై సెటైర్లు పేలుస్తూ ట్వీట్స్ చేస్తోంది. దీంతో ఈ రెండు దిగ్గజాల మధ్య పోరు రసవత్తంగా మారింది. ‘‘అది ఫోల్డ్ అయినప్పుడు మాకు తెలియజేయండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సామ్‌సంగ్ ఇప్పటికే ‘‘ఫోల్డ్’’ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ఫోల్డ్ మొబైల్ ఫోన్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే, ఆపిల్ ఇంకా ఫోల్డ్ మొబైల్ ఫోన్లను విడుదల చేయకపోవడంపై సామ్‌సంగ్ సెటైర్లు సంధించింది. సామ్‌సంగ్ నుంచి ‘‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5’’ ఉంది. ‘‘స్టిల్ వెయిటింగ్..’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

దీంతోనే సామ్‌సంగ్ ఆగకుండా.. మరొక ట్వీట్‌లో ‘‘మీకు తెలుసా.. మేము మీ AI అంచనాలను చాలా ఎక్కువగా సెట్ చేసి ఉండొచ్చు’’ ఈ ట్వీట్ ద్వారా ఆపిల్ తన కొత్త ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’ , ఐఫోన్ 16 సిరీస్‌తో వస్తున్న కొత్త ఏఐ ఫీచర్‌ని ఉద్దేశించింది. ఆపిల్‌లపై సామ్‌సంగ్ ఇలా సెటైర్లు వేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఆపిల్ యొక్క ఐప్యాడ్ ప్రో ప్రకటనపై ఇలాగే వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

Show comments