Site icon NTV Telugu

విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?

Samsung Galaxy Tab A11

Samsung Galaxy Tab A11

Samsung Galaxy Tab A11: శాంసంగ్‌ తాజాగా గెలాక్సీ A సిరీస్ టాబ్లెట్ Samsung Galaxy Tab A11 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో 8.7 అంగుళాల డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఆక్స్టా-కోర్ చిప్‌సెట్‌పై రన్ అవుతున్న ఈ డివైస్ 5,100mAh బ్యాటరీతో వస్తోంది. ఫోటోగ్రఫీ కోసం 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఇది 2023లో వచ్చిన Galaxy Tab A9 కు అప్డేటెడ్ గా మార్కెట్లోకి వచ్చింది.

Typhoon Ragasa: తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. వీడియోలు వైరల్

Samsung Galaxy Tab A11 భారత్‌లో 4GB RAM + 64GB స్టోరేజ్ Wi-Fi వెర్షన్ రూ.12,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.17,999గా ఉంది. ఇక సెల్యులర్ వెర్షన్లలో 4GB + 64GB మోడల్ రూ.15,999, 8GB + 128GB మోడల్ రూ.20,999 గా నిర్ణయించబడింది. ఇది గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Galaxy Tab A11లో 8.7 అంగుళాల HD+ (800×1340 పిక్సెల్స్) TFT డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇందులో 2.2GHz CPU స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ చిప్‌సెట్ ను అందించారు. ర్యామ్ ఆప్షన్లు 4GB నుండి 8GB వరకు, అలాగే స్టోరేజ్ 64GB నుండి 128GB వరకు లభిస్తుంది. అంతేకాకుండా, మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.

CI Legal Notice To Chandrababu: సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్‌ నోటీసులు..

ఇక కెమెరా విభాగంలో 8MP రియర్ కెమెరా (ఆటోఫోకస్ సపోర్ట్‌తో), సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే కనెక్టివిటీ అండ్ ఫీచర్ల విషయానికి వస్తే.. Wi-Fi, 5G, Bluetooth 5.3, GPS, GLONASS, BeiDou, Galileo, QZSS సపోర్ట్‌లతో పాటు USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. అలాగే , డాల్బీ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు అందించారు. Galaxy Tab A11లో 5,100mAh బ్యాటరీ అమర్చబడింది. దీని బరువు 337 గ్రాములు కాగా పరిమాణం 211.0×124.7×8.0mmగా ఉంది.

Exit mobile version