Samsung Galaxy S26 series: శామ్‌సంగ్ (Samsung) అభిమానులకు గుడ్ న్యూస్. 2026లో విడుదల కానున్న శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S26 (కోడ్‌నేమ్ M1), S26+ (M2), S26 అల్ట్రా (M3) గురించి లీక్స్ రావడం మొదలయ్యాయి. ఈ కొత్త సిరీస్ భారీ మార్పుల కంటే, ప్రస్తుత డిజైన్‌ను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority) నుండి వచ్చిన తాజా లీక్‌ల ప్రకారం.. అంతర్గత టెస్టింగ్ బిల్డ్‌ల నుండి సేకరించిన ప్రాథమిక రెండర్‌లలో కెమెరా డిజైన్ లీకైంది. ఈ కొత్త కెమెరా మాడ్యూల్, రాబోయే గెలాక్సీ Z ఫోల్డ్ 7 తరహాలో ఉండే అవకాశం ఉంది. ప్రతి కెమెరాకు గుండ్రటి రింగులు అలాగే ఉన్నప్పటికీ.. వాటిని కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండే ఐలాండ్ లో ఉంచడం ద్వారా మరింత మంచి లుక్ అందించడానికి శామ్‌సంగ్ ప్రయత్నిస్తోంది.
Ellyse Perry: సెంచరీతో అదరగొట్టిన ఎలీస్ పెర్రీ.. చరిత్రలో అరుదైన ఘనత..!
ముఖ్యంగా గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ ముందు వెర్షన్ కంటే కొత్త లుక్ ను సంతరించుకోనున్నట్లు తెలుస్తోంది. మరింత గుండ్రని అంచులు (Rounded Corners), సున్నితమైన సిల్హౌట్‌తో, ఈ కొత్త డిజైన్ ప్రీమియం లుక్‌ను కోల్పోకుండా.. చేతిలో పట్టుకోవడానికి మరింత సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. హార్డ్‌వేర్ వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ.. అంచనా ప్రకారం, చాలా మార్కెట్లలో క్వాల్‌కామ్ తదుపరి తరం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) ప్రాసెసర్‌ను అందించనున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం మాత్రం ఎక్సినోస్ (Exynos) వేరియంట్‌లు పరిమితం కానున్నాయి.
Alluri Agency Shock: అల్లూరి ఏజెన్సీలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి!
కెమెరా విషయంలో S26 అల్ట్రా మెరుగైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు, అధునాతన కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ సామర్థ్యాలను పొందనుంది. ఈ రంగంలో శామ్‌సంగ్ తన పోటీదారులను అధిగమించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ లీక్ ద్వారా తెలిసిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. గెలాక్సీ S26 సిరీస్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన One UI 8.5 తో రానుంది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ లో మంచి యానిమేషన్లు, మెరుగైన మల్టీటాస్కింగ్, మరింత మంచి విడ్జెట్‌లు, లోతైన AI ఇంటిగ్రేషన్‌లు, శామ్‌సంగ్ ఎకోసిస్టమ్‌లో మెరుగైన డివైజ్-టు-డివైజ్ కంటిన్యూటీ ఫీచర్లు ఉన్నాయి. కాగా, గెలాక్సీ S25 సిరీస్‌కు One UI 8.5 బీటా వెర్షన్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. శామ్‌సంగ్ సంప్రదాయ షెడ్యూల్ ప్రకారం.. రాబోయే గెలాక్సీ S26 సిరీస్ 2026 ఫిబ్రవరిలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
