Samsung Galaxy S23 FE Launch and Price in India: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ‘శాంసంగ్’కు భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమయింది. శాంసంగ్ ఎస్23 సిరీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడింది. అప్పటినుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) గురించి చర్చ జరుగుతోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ పని చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరికొద్ది నెలల్లోనే ఎస్23 ఎఫ్ఈను పరిచయం చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
Samsung Galaxy S23 FE Leaks:
టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ ప్రకారం.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 మోడల్స్ తర్వాత శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఎస్23కి బడ్జెట్ ఫ్రెండ్లీ వర్షెన్‌గా ఈ ఫోన్ ఉండనుంది. అయితే హార్డ్‌వేర్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ 68 రేటెడ్ ప్రొటెక్షన్, కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయని అంచనా. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లే మరియు వెనుక మూడు కెమెరాలను కలిగి ఉంటుంది.
Also Read: iPhone 14 Pro Max Price Drop: బంపర్ ఆఫర్.. రూ. 40 వేలకే ఐఫోన్ 14 ప్రో మాక్స్!
Samsung Galaxy S23 FE Specs:
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ రెండు వేర్వేరు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇది స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ఎస్ఓసీతో రావచ్చు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4కి కూడా ఇది శక్తినిస్తుంది. రెండవ వేరియంట్‌లో ఎస్23 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీని కలిగి ఉంటుంది. స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మీరు 6GB లేదా 8GB RAM మరియు 128GB లేదా 256GB స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉండే అవకాశం ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇందులో ఉండొచ్చు.
Samsung Galaxy S23 FE Price:
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈలో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 25W ఛార్జింగ్ మద్దతుగా 4500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో లభించొచ్చు. ఎస్23 ఎఫ్ఈ ధర రూ. 50,000లుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ జూలై చివరి నాటికి లాంచ్ చేయబడవచ్చు. గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ లాంచ్ డేట్, ధరలపై రానున్న రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Best Mileage Bike 2023: స్టైల్‌లోనే కాదు మైలేజ్‌లోనూ కింగే.. ఈ బైక్ ధర కేవలం 54 వేలు మాత్రమే!