శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు.. గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫోన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, హెడ్‌లైన్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.. ఈ కొత్త ఫోన్ మూడు ఆప్షన్స్ లో రానుంది.. 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో)కి సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. గరిష్టంగా 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్‌ను అందిస్తుంది.. 128 జిబీ స్టోరేజ్ తో రాబోతుంది.. సెల్ఫీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్.. ట్రిపుల్ కెమెరాను అందుబాటులోకి రానుంది.. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ సెకండరీ సెన్సార్, 2ఎంపీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది..
ఇక 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. శాంసంగ్ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 21 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.. అలాగే ఈ ఫోన్ బరువు 217 గ్రాములు ఉంటుంది.. ఇక ధర విషయానికొస్తే.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ గ్రే, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. గతంలో లాంచ్ అయిన గెలాక్సీ ఎ15 ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 19,499గా నిర్ణయించింది. అలాగే, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,499గా ఉంది..