Site icon NTV Telugu

వీగన్ లెదర్ బ్యాక్‌, 50MP రియల్ కెమెరాతో రూ.15 వేలలోపే Samsung Galaxy F70e

Samsung Galaxy F70e

Samsung Galaxy F70e

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన కొత్త Galaxy F70 సిరీస్‌ను భారత మార్కెట్‌లో త్వరలో విడుదల చేయనుందని అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్‌లో భాగంగా రాబోతున్న Samsung Galaxy F70e స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపే ఉండనుందని లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ Flipkart మరియు Samsung India ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. శామ్‌సంగ్ ఇంకా అధికారిక లాంచ్ తేదీ, మోడళ్ల పేర్లను ప్రకటించనప్పటికీ, Galaxy F70 సిరీస్‌లో ఒక మిడ్-రేంజ్ ఫోన్‌తో పాటు ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఉండనున్నట్లు టీజ్ చేసింది. తాజాగా ఆన్‌లైన్‌లో కనిపించిన రెండర్‌ల ప్రకారం Galaxy F70e డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

డిజైన్ & డిస్‌ప్లే
Samsung Galaxy F70e వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా కనిపించనుంది. ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఉండగా, చుట్టూ కొద్దిగా మందపాటి బెజెల్స్ కనిపించనున్నాయి. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కీలు ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కనీసం నలుపు రంగు ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండగా, 120Hz రిఫ్రెష్ రేట్కు మద్దతు లభించనుంది. ప్రాసెసర్ & స్టోరేజ్ విషయానికి వస్తే.. Galaxy F70e స్మార్ట్‌ఫోన్‌కు MediaTek Dimensity 6300 చిప్‌సెట్ శక్తినిస్తుందని తెలుస్తోంది. ఇది.. 6GB వరకు RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రావచ్చు. అదనంగా మైక్రో SD కార్డ్ మద్దతు కూడా ఉండే అవకాశం ఉంది.

కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం Galaxy F70eలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా.. 2MP సెకండరీ కెమెరా ఉండనున్నాయి.. మొత్తంగా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా అందించనున్నారు. మరోవైపు.. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉండగా, 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు లభించనుంది. Galaxy F70e Android 16 ఆధారిత Samsung One UI 8పై పనిచేస్తుందని సమాచారం. ఇక, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ (దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ) కూడా అందించనుంది.. మరోవైపు.. లీకుల ప్రకారం, Samsung Galaxy F70e ధర రూ.10,000 – రూ.15,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అదే సిరీస్‌లో మరో మోడల్ ధర రూ.30,000 లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్, పెద్ద బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లతో Galaxy F70e మార్కెట్‌లో మంచి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version