NTV Telugu Site icon

Samsung Galaxy F06 5G: రూ. 10 వేలకే శాంసంగ్‌ న్యూ స్మార్ట్‌ ఫోన్.. రేపే రిలీజ్

Samsung

Samsung

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. శాంసంగ్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మతిపోయే ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతుండడంతో సేల్స్ లో దూసుకెళ్తోంది. కాగా టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. రూ. 10 వేల ధరలోనే 5G మొబైల్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం.

శాంసంగ్ గత వారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా గెలాక్సీ F సిరీస్ యొక్క గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేసింది. ఇప్పుడు దాని లాంచింగ్ డేట్ ను ప్రకటించింది. Samsung Galaxy F06 5G ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.9000-9,999 మధ్య ఉండొచ్చని అంచనావేస్తున్నారు. గత సంవత్సరం రూ.7,999కి లాంచ్ అయిన Galaxy F05కి సక్సెసర్‌గా దీన్నీ తీసుకొస్తోంది. బహమా బ్లూ, లిట్‌ వయోలెట్‌ కలర్‌ ఆప్షన్లలో లభించనున్నది. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ ఈ-స్టోర్‌ల్లో విక్రయిస్తారు.

Galaxy F06 5G, Galaxy F05 కంటే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో లేత నీలం రంగు బ్యాక్ ప్యానెల్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌06 5జీ ఫోన్‌ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో రానుంది. మైక్రో ఎస్డీ కార్డ్‌ సాయంతో ఒక టిగా బైట్‌ వరకూ పొడిగించుకోవచ్చు. అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవం కోసం ఫోన్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మంచి స్పష్టత కోసం ఫోన్‌లో 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. అధిక నాణ్యత గల సెల్ఫీల కోసం ఈ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.