Samsung Galaxy F06 5G: రూ. 10 వేలకే శాంసంగ్ న్యూ స్మార్ట్ ఫోన్.. రేపే రిలీజ్
- రూ. 10 వేలకే శాంసంగ్ న్యూ స్మార్ట్ ఫోన్
- ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్ లో లాంచ్
- ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఈ-స్టోర్‌ల్లో సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. శాంసంగ్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మతిపోయే ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతుండడంతో సేల్స్ లో దూసుకెళ్తోంది. కాగా టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. రూ. 10 వేల ధరలోనే 5G మొబైల్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం.
శాంసంగ్ గత వారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా గెలాక్సీ F సిరీస్ యొక్క గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేసింది. ఇప్పుడు దాని లాంచింగ్ డేట్ ను ప్రకటించింది. Samsung Galaxy F06 5G ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.9000-9,999 మధ్య ఉండొచ్చని అంచనావేస్తున్నారు. గత సంవత్సరం రూ.7,999కి లాంచ్ అయిన Galaxy F05కి సక్సెసర్‌గా దీన్నీ తీసుకొస్తోంది. బహమా బ్లూ, లిట్ వయోలెట్ కలర్ ఆప్షన్లలో లభించనున్నది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఈ-స్టోర్‌ల్లో విక్రయిస్తారు.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
Galaxy F06 5G, Galaxy F05 కంటే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో లేత నీలం రంగు బ్యాక్ ప్యానెల్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో రానుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవం కోసం ఫోన్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మంచి స్పష్టత కోసం ఫోన్‌లో 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. అధిక నాణ్యత గల సెల్ఫీల కోసం ఈ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!