Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్తగా విడుదలైన Samsung Galaxy A27 5G & OnePlus Nord 6 వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు అన్ని విభాగాల్లో ప్రత్యేక ఫీచర్లతో వస్తున్నప్పటికీ.. డిజైన్, డిస్‌ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ పరంగా కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. మరి అవేంటో చూసి.. రెండింటిలో ఏది బెస్ట్ ఫోనో చూద్దామా..
డిజైన్, బిల్డ్ క్వాలిటీ:
Samsung Galaxy A27 5G బాక్సీ డిజైన్‌తో పాటు S సిరీస్‌ను తలపించే కర్వ్డ్ సైడ్స్‌ను కలిగి ఉంది. గ్లోసీ ఫినిష్‌తో వచ్చిన ఈ ఫోన్ లైట్ పింక్, లైట్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. అలాగే IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణను అందిస్తుంది. మరోవైపు OnePlus Nord 6 మరింత ప్రీమియం లుక్‌తో వస్తోంది. ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్, క్విక్ సిల్వర్ రంగుల్లో లభించే ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో పాటు MIL-STD-810H సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. దీంతో డ్యూరబిలిటీ పరంగా Nord 6 స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తుంది.
డిస్‌ప్లే:
Galaxy A27 5Gలో 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందించారు. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 800 నిట్స్, గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అదనంగా Corning Gorilla Glass Victus+ రక్షణ కూడా ఉంది. OnePlus Nord 6లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. 1800 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ డిస్‌ప్లే మరింత ఆకర్షణీయంగా నిలుస్తుంది. వన్ ప్లస్ క్రిస్టల్ గార్డ్ గ్లాస్ రక్షణ కూడా ఇందులో ఉంది.
ప్రాసెసర్, పనితీరు:
శామ్‌సంగ్ గెలాక్సీ A27 5Gలో Qualcomm Snapdragon 6 Gen 3 చిప్‌సెట్, LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. 4nm టెక్నాలజీపై రూపొందిన ఈ ప్రాసెసర్ AnTuTuలో సుమారు 8.68 లక్షల స్కోర్ సాధించింది. వన్ ప్లస్ నార్డ్ 6లో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ అందించారు. ఈ చిప్‌సెట్ రే ట్రేసింగ్, ఆన్-డివైస్ AI, Wi-Fi 7 వంటి ప్రీమియం ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. AnTuTuలో సుమారు 23 లక్షల స్కోర్‌తో ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
కెమెరా విభాగం:
శామ్‌సంగ్ లో 50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో సెన్సార్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక మరోవైపు Nord 6లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. అయితే ఫోటోగ్రఫీ పరంగా శామ్‌సంగ్ కెమెరా అనుభవం కొంత మెరుగ్గా ఉంటుంది.
బ్యాటరీ, ఛార్జింగ్:
Samsung Galaxy A27 5Gలో 5,000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదే OnePlus Nord 6లో భారీ 9,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. బ్యాటరీ విభాగంలో Nord 6కు స్పష్టమైన ఆధిక్యం ఉంది.
ధరలు:
Samsung Galaxy A27 5Gపై ప్రస్తుతం బ్యాంక్ లేదా UPI ఆఫర్లతో రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
6GB + 256GB వేరియంట్ ధర రూ.28,999
8GB + 128GB వేరియంట్ ధర రూ.31,999 (డిస్కౌంట్ తర్వాత)
8GB + 256GB వేరియంట్ ధర రూ.37,499 (డిస్కౌంట్ తర్వాత).
OnePlus Nord 6 ధరలు:
8GB + 256GB వేరియంట్ రూ.42,999
12GB + 256GB వేరియంట్ రూ.47,999.
ఏ ఫోన్ కొనాలి?
రూ.30 వేల లోపు బడ్జెట్ ఉన్నవారికి Samsung Galaxy A27 5G మంచి ఎంపిక. మంచి కెమెరా, One UI ఆధారిత Android 16 అనుభవం, 6 ఏళ్ల OS & సెక్యూరిటీ అప్‌డేట్ల హామీ దీని ప్రధాన బలాలు. అయితే గేమింగ్, పనితీరు, డిస్‌ప్లే, డ్యూరబిలిటీ, బ్యాటరీ వంటి అంశాల్లో మాత్రమే OnePlus Nord 6 ముందంజలో ఉంది. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవారికి Nord 6 మంచి విలువైన ఎంపికగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఇది ఆల్‌రౌండర్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.

