6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌, ఆరేళ్ల అప్‌డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!

  • శాంసంగ్ Galaxy A08ను భారత మార్కెట్లోకి అధికారికంగా లాంచ్
  • 6.7 అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
  • మీడియాటెక్ హీలియో G99+ ప్రాసెసర్
  • 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP సెల్ఫీ కెమెరా
  • భారీ 6,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 6 మేజర్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు..
Samsung Galaxy A08

Samsung Galaxy A08

Samsung Galaxy A08 Launched: శాంసంగ్ (Samsung) సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ Galaxy A08ను భారత మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది. రోజువారీ డిజిటల్ అవసరాలైన ఇంటర్నెట్ బ్రౌజింగ్, మల్టీమీడియా వినియోగం, సాధారణ గేమింగ్, ఫోటోగ్రఫీని దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను తాయారు చేశారు. ఇదివరకు మోడల్ గెలాక్సీ A06తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేసిన ప్రాసెసర్, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్, సరికొత్త AI ఫీచర్లు, భారీ బ్యాటరీ దీని ప్రధాన ఫీచర్స్ గా నిలుస్తున్నాయి.

డిస్‌ప్లే & డిజైన్

శాంసంగ్ గెలాక్సీ A08 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ (720 x 1600 పిక్సెల్స్) Infinity-U PLS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇవ్వడం వల్ల స్క్రోలింగ్, స్క్రీన్ నావిగేషన్ ఎంతో స్మూత్‌గా సాగుతుంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ను అందించారు. ఈ డివైజ్ కేవలం 8 మిమీ మందం, 197 గ్రాముల బరువుతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక భాగం గ్లాస్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ పాలిమర్ (GFRP) మెటీరియల్‌తో పాటు లేటెస్ట్ గెలాక్సీ డిజైన్ తరహా నిలువు కెమెరా సెటప్‌ను పొందింది. సైడ్ బటన్ల కోసం ‘కీ ఐలాండ్ 2.0’ డిజైన్ అందించారు. దుమ్ము, తేలికపాటి నీటి తుంపర్ల నుంచి రక్షణగా ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది.

ప్రాసెసర్

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G99+ (MediaTek Helio G99+) 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్, Arm Mali-G57 MC2 GPUతో పనిచేస్తుంది. యాప్స్ వేగంగా తెరచుకోవడానికి, మల్టీ టాస్కింగ్ సాఫీగా సాగడానికి ఈ ప్రాసెసర్ దోహదపడుతుంది. ఇందులో 4GB ర్యామ్ లభించనుండగా, ‘RAM Plus’ ఫీచర్ ద్వారా అంతర్గత స్టోరేజ్‌ను వర్చువల్ మెమరీగా వాడుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకునే సదుపాయం ఉంది.

కెమెరా సెటప్

ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు డ్యూయల్ కెమెరా అమరికను ఇచ్చారు. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, పోర్ట్రెయిట్ షాట్ల కోసం f/2.4 ఎపర్చర్‌తో కూడిన 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చర్‌తో 8MP కెమెరాను అందించారు.

AI ఫీచర్లు & సాఫ్ట్‌వేర్

గెలాక్సీ A08 స్మార్ట్‌ఫోన్ వన్‌యూఐ (One UI) ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. ఇందులో గూగుల్ ‘సర్కిల్ టు సెర్చ్ 3.0’ (Circle to Search 3.0) ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా స్క్రీన్‌పై ఉన్న ఏదైనా చిత్రం, టెక్స్ట్ లేదా వీడియోను సర్కిల్ చేయడం ద్వారా యాప్ నుండి బయటకు రాకుండానే నేరుగా గూగుల్ సెర్చ్ చేయవచ్చు. వీటితో పాటు జెమినీ (Gemini), పర్‌ప్లెక్సిటీ (Perplexity) వంటి AI అసిస్టెంట్లను సులభంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. క్విక్ షేర్, మోడ్స్ అండ్ రొటీన్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల డేటా భద్రత కోసం శాంసంగ్ నాక్స్ (Knox) సెక్యూరిటీని అందించారు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6 మేజర్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది.

బ్యాటరీ & కనెక్టివిటీ

ఈ ఫోన్‌లో 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది ఇదివరకు మోడల్ కంటే దాదాపు 22% ఎక్కువ వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుంది. దీనికి తోడు 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. సెక్యూరిటీ కోసం పక్కభాగంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆడియో కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి.

ధర

భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A08 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ డార్క్ బ్లూ, సిల్వర్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అధికారిక రిటైల్ భాగస్వాములు, Samsung.com మరియు ప్రముఖ ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా 6 నెలల వరకు, అలాగే భాగస్వామ్య NBFCల ద్వారా 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) ప్రయోజనాలు పొందవచ్చు.