Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..
- పెరిగిన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ధరలు..
- నేటి నుంచే అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ A మరియు F సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 10, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ , మిడ్-రేంజ్ విభాగాల్లోని గెలాక్సీ A06, A07, A17, A36, A56 , F17 మోడల్స్‌పై ఈ ప్రభావం ఉండనుంది.
మోడల్ వారీగా పెరగనున్న ధరల వివరాలు..
గెలాక్సీ A06 అండ్ A07: బడ్జెట్ ఫోన్ అయిన గెలాక్సీ A06 ధర సుమారు రూ.1,000 పెరిగి రూ.13,499కి చేరుకోవచ్చు. అలాగే గెలాక్సీ A07 ధర రూ.1,250 వరకు పెరిగి రూ.10,999 అయ్యే అవకాశం ఉంది.
Also Read
- Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
గెలాక్సీ A17: ఈ మిడ్-రేంజ్ ఫోన్ ధర రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరగవచ్చు. దీని టాప్ వేరియంట్ ధర గరిష్టంగా రూ.27,999 వరకు ఉండే ఛాన్స్ ఉంది.
గెలాక్సీ A36: ఈ మోడల్‌పై భారీగా రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ధర పెరగవచ్చని లీక్డ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనితో కాన్ఫిగరేషన్‌ను బట్టి ధర రూ.43,499 వరకు వెళ్లవచ్చు.
గెలాక్సీ A56: శాంసంగ్ మిడ్-రేంజ్ లైనప్‌లో కీలకమైన ఈ ఫోన్ ధరపై అత్యధికంగా రూ.2,000 నుంచి రూ.3,500 వరకు పెరుగుదల ఉండవచ్చు. దీనివల్ల హై-ఎండ్ వేరియంట్ ధర రూ.52,499కి చేరుకోవచ్చు. గెలాక్సీ F17.. దీనిపై అన్ని వేరియంట్లకూ కలిపి ఫ్లాట్‌గా రూ.1,000 ధర పెరిగే అవకాశం ఉంది.
తయారీ ఖర్చులు, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొత్త మోడల్స్ గెలాక్సీ A37 , A57 మార్కెట్లోకి వస్తున్న తరుణంలో ఈ పాత మోడల్స్ ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!