Site icon NTV Telugu

Samsung Black Friday Sale: ‘శాంసంగ్’ స్మార్ట్ టీవీ కొనండి.. 93 వేల ఉచిత సౌండ్‌బార్ పట్టండి!

Neo Qled 8k Tv Price

Neo Qled 8k Tv Price

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025ని ప్రకటించింది. ఈసారి ‘బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స’ అనే ట్యాగ్‌లైన్‌తో డిస్కౌంట్లను తీసుకొచ్చింది. నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఈ సేల్.. నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, గృహోపకరణాలపై ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అంతేకాదు ఎంపిక చేసిన స్మార్ట్ టీవీలపై ఉచిత సౌండ్‌బార్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా శాంసంగ్ రూ.92,990 వరకు విలువైన సౌండ్‌బార్‌లను ఉచితంగా అందిస్తోంది. Samsung Vision AI TV శ్రేణిలపై సౌండ్‌బార్‌లను ఇస్తోంది. 2025లో ప్రారంభించబడిన Neo QLED 8K, OLED, Neo QLED, QLED సహా ది ఫ్రేమ్ మోడళ్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 85 inches 8K Ultra HD Smart Neo QLED TV ధర రూ.13,49,990గా ఉంది. అలానే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. శామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. EMI ఎంపికలతో జీరో డౌన్ పేమెంట్‌ను కూడాఎంచుకోవచ్చు.

Also Read: Keerthy Suresh: ప్లాప్స్ పరంపరకు కీర్తి సురేష్ చెక్ పెట్టేనా?.. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఊపిరిపోస్తుందా?

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. శాంసంగ్ విజన్ AI-ఆధారిత టీవీలు అత్యుత్తమ పిక్చర్ మెరుగుదల, స్మార్ట్ కంటెంట్ సహా బెస్ట్ వీక్షణ అనుభవాన్ని అందిస్తాయి. శాంసంగ్ 19 సంవత్సరాలుగా ప్రపంచ నంబర్ 1 టీవీ బ్రాండ్‌గా ఉంది. ఎప్పటికప్పుడు సాంకేతికత, ప్రీమియం డిజైన్‌పై దృష్టి సారిస్తూ దూకుపోతోంది. బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు శాంసంగ్ రిటైల్ స్టోర్లు, ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటాయి.

Exit mobile version