Site icon NTV Telugu

200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్స్, భారీ బ్యాటరీలతో నేడే భారత మార్కెట్లోకి Redmi Note 15 Pro సిరీస్ లాంచ్.!

Redmi Note 15 Pro

Redmi Note 15 Pro

Redmi Note 15 Pro Series: షియోమీ (Xiomi) సబ్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) నుంచి కొత్తగా రెడ్‌మీ నోట్ 15 ప్రో 5G (Redmi Note 15 Pro 5G), రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5G (Redmi Note 15 Pro+ 5G) స్మార్ట్‌ఫోన్లు నేడు (జనవరి 29) భారత మార్కెట్లో లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లు.. భారత్‌లో అమెజాన్ ద్వారా అమ్మకానికి రానున్నాయి.

Team India Biggest Defeats: స్వదేశంలో టీమిండియాకు భారీ షాక్.. అతిపెద్ద పరాజయాల లిస్ట్ ఇదే!

Redmi Note 15 Pro సిరీస్ లాంచ్ ఈరోజు ఉదయం 11:00 గంటలకు (IST) జరగనుంది. గత కొన్ని రోజులుగా రెడ్‌మి తన సోషల్ మీడియా ఛానెల్స్, అధికారిక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ల ఫీచర్లపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికీ అధికారిక ధరలు వెల్లడికాలేదు. అయితే లీక్‌ల ప్రకారం.. రెడ్‌మీ నోట్ 15 ప్రో 5G 8GB + 128GB వేరియంట్ ధర సుమారు రూ. 30,999, రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5G 8GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ. 38,999 గా ఉండబోతున్నట్లు సమాచారం.

రెడ్‌మీ నోట్ 15 ప్రో 5G కార్బన్ బ్లాక్, మిరాజ్ బ్లూ, సిల్వర్ యాష్ రంగులలో లభిస్తుండగా 8GB+128GB, 8GB+256GB వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 8GB+256GB, 12GB+256GB, 12GB+512GB వేరియంట్లలో అందుబాటులోకి రానుండగా.. కార్బన్ బ్లాక్, కాఫీ మోచ్చ, మిరాజ్ బ్లూ రంగులలో లభిస్తుంది. రెడ్‌మి టీజర్ల ప్రకారం ఈ సిరీస్‌లో టాప్ ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, గరిష్టంగా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లభిస్తుంది.

TTD Ghee Adulteration Case : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్స్ తో అత్యంత బలమైన ప్రొటెక్షన్‌తో మార్కెట్లో అరుదైన ఫీచర్ కలిగి ఉంది. ఇంకా 200 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, రెడ్‌మీ నోట్ 15 ప్రో 5G 6,580mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్, 18W రివర్స్ చార్జింగ్, మీడియాటెక్ డిమెంసిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5G లో 6,500mAh బ్యాటరీ, 100W సూపర్ ఫాస్ట్ చార్జింగ్, 22.5W రివర్స్ చార్జింగ్, Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ ఉండనుంది.

Exit mobile version