Site icon NTV Telugu

108MP కెమెరా, 5520mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో స్లిమ్ డిజైన్‌తో వస్తున్న Redmi Note 15!

Redmi Note 15 India Launch

Redmi Note 15 India Launch

ప్రముఖ చైనీస్ బ్రాండ్ ‘షావోమీ’ భారతదేశంలో కొత్త ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ‘రెడ్‌మీ నోట్ 15’ సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయింది. త్వరలో భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ తన 15 సిరీస్‌లో మూడు ఫోన్‌లను లాంచ్ చేయనుంది. 15 సిరీస్‌లో Redmi Note 15, Note 15 Pro, Note 15 Pro Plus ఉన్నాయి. అయితే కంపెనీ ముందుగా రెడ్‌మీ నోట్ 15ను లాంచ్ చేసి.. ఆపై ప్రో వేరియంట్‌లను రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. 2026 జనవరి 6న భారతదేశంలో రెడ్‌మీ నోట్ 15 లాంచ్ కానుంది.

భారతదేశంలో విడుదల అయ్యే రెడ్‌మీ నోట్ 15 ఫోన్.. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ కంటే భిన్నంగా ఉండనుంది. కొన్ని మార్పులతో 15ను భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో డ్‌మీ నోట్ 15 వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్‌తో రావచ్చు. 108MP కెమెరాతో రానుంది. కంపెనీ చైనీస్ వేరియంట్‌లో 50MP కెమెరాను ఇచ్చింది. ఈ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5520mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ HyperOS 2తో వస్తుంది.

Also Read: Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్‌!

రెడ్‌మీ నోట్ 15 ఫోన్ స్లిమ్ డిజైన్‌తో రానుంది. టీజర్‌లో స్లిమ్ డిజైన్‌ స్పష్టంగా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందనే దానిపై రెడ్‌మీ కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ధర 20-25 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది. శక్తివంతమైన ప్రాసెసర్, బిగ్ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండనుంది. రెడ్‌మీ కంపెనీ ఎప్పుడూ తక్కువ బడ్జెట్‌తో మంచి ఫీచర్స్ అందిస్తుంటుందన్న విషయం తెలిసిందే.

Exit mobile version