Redmi Note 15 5G: భారత్ మార్కెట్‌లో షియోమీ ఈ నెలలో రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో భాగంగా ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభించింది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, 108MP కెమెరా, 6 ఏళ్ల వరకు అప్‌డేట్స్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
Read Also: రూ.9,699కే జియో ఎకోసిస్టమ్‌తో Blankput తొలి స్మార్ట్ టీవీ.. ధర, ఫీచర్లు ఇవే!
రెడ్‌మి నోట్ 15 5G ధరలు..
* 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999
* 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999..
* ఈ ఫోన్ అమెజాన్ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు డిస్కౌంట్..
* 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
* 120Hz రీఫ్రెష్ రేట్
* 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్
* బ్లాక్, గ్లేసియర్ బ్లూ, మిస్ట్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Read Also: Varanasi Release Date: క్రేజీ అప్‌డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
కాగా, పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇది 8GB LPDDR4x ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌ని జోడించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2పై వర్క్ చేస్తుంది. ముఖ్యంగా దీనికి 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తో పాటు 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని షియోమీ కంపెనీ ప్రకటించింది.
కెమెరా ఫీచర్లు..
* వెనుకవైపు 108MP ప్రైమరీ కెమెరా
* 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
* ముందు వైపు 20MP సెల్ఫీ కెమెరా
* రియర్ కెమెరాతో 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు..
* సెల్ఫీ కెమెరాతో 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్
బ్యాటరీ
* ఈ ఫోన్‌లో 5520mAh బ్యాటరీ
45W ఫాస్ట్ ఛార్జింగ్
* 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
* ఈ ఫోన్‌తో ఇతర డివైసులను కూడా ఛార్జ్ చేయవచ్చు..
* IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్
* ఆడియో కోసం డాల్బీ అట్మాస్
* Hi-Res ఆడియో సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు
భద్రత
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్
* ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు
కనెక్టివిటీ
* 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.1
* GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటి అన్ని ఆధునిక సదుపాయాలు
అయితే, రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లేతో పాటు 108MP కెమెరా, దీర్ఘకాల అప్‌డేట్స్, ఫాస్ట్, రివర్స్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఒక బలమైన ఎంపికగా నిలవనుంది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో లభిస్తున్న డిస్కౌంట్‌లతో ఇది మరింత ఆకర్షణీయమైన డీల్‌గా మారబోతుంది.
