NTV Telugu Site icon

Redmi Note 13 Pro: రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే..

Red Mi (2)

Red Mi (2)

మార్కెట్ లో రెడ్ మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది రెడ్ మీ కొత్త మొబైల్స్ ఎక్కువగా వస్తున్నాయి.. 2024 జనవరి 4న రెడ్‌మి నోట్ 13 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో రెడ్‌మి నోట్ 13 మోడల్, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌తో పాటుగా వచ్చింది.. రెడ్‌మి నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.. భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 13 ప్రో (12జీబీ + 256జీబీ) వేరియంట్ రూ. 32,999కు రానుంది..

ఫీచర్స్ విషయానికొస్తే.. 6.67-అంగుళాల 1.5కె ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ ప్యానెల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14తో రానుంది. క్వాల్‌కామ్ స్పాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.. ఇక సెల్ఫీ ప్రియులకు పండగే.. ఈ ఫోన్ మూడు కెమెరాలతో రానుంది.. 200ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా డిస్‌ప్లే పైభాగంలో సెంట్రలైజడ్ హోల్-పంచ్‌తో రానుంది. 16ఎంపీ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది.. ఫాస్ట్ చార్జింగ్ 5,100ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..

ధర విషయానికొస్తే.. ఈ కొత్త మొబైల్స్ 8జీబీ + 256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ + 512జీబీ 16జీబీ + 512జీబీ వేరియంట్ల ధర వరుసగా సీఎన్‌వై 1,699 (దాదాపు రూ. 19,700), సీఎన్‌వై 1800 (రూ. 22వేలు), సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23,100), సీఎన్‌వై 2,099 (దాదాపు రూ. 24,300) ఉండనున్నాయి. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్, వైట్ కలర్ వెరియంట్లలో రానుంది.. ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఫోన్ ఇదే కావడం విశేషం..