REDMI Buds 8 Lite: రెడ్ మీ నోట్ 15 ప్రో సిరీస్‌తో పాటు షావోమీ గ్లోబల్ మార్కెట్ల కోసం కొత్త బడ్జెట్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ రెడ్ మీ బడ్స్ 8 లైట్ (REDMI Buds 8 Lite)ను అధికారికంగా ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లతో పాటు దృఢమైన డిజైన్‌పై ఫోకస్ చేసిన ఈ ఇయర్‌బడ్స్ తక్కువ ధరలో ఎక్కువ విలువ అందించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.
200MP కెమెరా, ప్రీమియం ఫీచర్లతో Redmi Note 15 Pro+ స్మార్ట్‌ఫోన్ విడుదల
ఇందులో 12.4mm టైటానియం డయాఫ్రామ్ డైనమిక్ డ్రైవర్ ను అందించారు. ఇది క్లియర్ సౌండ్, డీటెయిల్డ్ ఆడియో అవుట్‌పుట్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉండగా, AAC, SBC కోడెక్స్ కు మద్దతు ఉంది. ఇయర్‌బడ్స్‌లో శక్తివంతమైన నాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో టాక్, ఫీడ్‌బ్యాక్ మైక్రోఫోన్ల సహాయంతో 42dB వరకు వైడ్ ఫ్రీక్వెన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది. అలాగే ట్రాన్స్‌పరెన్సీ మోడ్ తో ఇయర్‌బడ్స్ తీసేయకుండానే చుట్టుపక్కల శబ్దాలను వినే అవకాశం కల్పిస్తుంది.
కాల్‌ల కోసం డ్యుయల్ మైక్ AI ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీని ఉపయోగించారు. ఇది వినియోగదారుడి వాయిస్‌ను స్పష్టంగా క్యాప్చర్ చేస్తూ 6 మీ/సె. వేగం వరకు గాలి శబ్దాన్ని కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ఆడియో కస్టమైజేషన్ కోసం ‘5 EQ ప్రీసెట్స్’ ఉపయోగించి స్టాండర్డ్, ట్రెబుల్ ఎన్‌హాన్స్, బాస్ ఎన్‌హాన్స్, వాయిస్ ఎన్‌హాన్స్, వాల్యూమ్ బూస్ట్ చేయవచ్చు. అలాగే Xiaomi ఎయిర్ బడ్స్ యాప్ ద్వారా కస్టమ్ EQ సెట్టింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Shambala OTT Release: ఓటీటీలోకి ‘శంబాల’ మూవీ.. ఎక్కడ చుడొచ్చంటే..?
ప్రస్తుత లైఫ్‌స్టైల్‌ను దృష్టిలో పెట్టుకుని డ్యుయల్ డివైస్ స్మార్ట్ కనెక్షన్ సపోర్ట్ ఇచ్చారు. ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్ట్ అయి, యాక్టివ్ కాల్ లేదా ఆడియోకు ఆటోమేటిక్‌గా స్విచ్ అవుతుంది. ఒక్క ఇయర్‌బడ్‌కు 8 గంటల బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 36 గంటల ప్లేబ్యాక్ (ANC ఆఫ్‌లో), 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 2 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుంది. ఇయర్‌బడ్స్‌కు IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, స్మార్ట్ ట్యాప్ కంట్రోల్స్, USB Type-C ఛార్జింగ్ కూడా ఉన్నాయి.
ఈ రెడ్ మీ బడ్స్ 8 లైట్ బ్లాక్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్నాయి. వీటి ధర EUR 22.9గా నిర్ణయించారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2,400. ఇప్పటికే పలు గ్లోబల్ మార్కెట్లలో ఇవి అమ్మకాల్లోకి వచ్చాయి.
