Site icon NTV Telugu

Redmi 12 Launch : రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్..ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi12

Redmi12

ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రెడ్ మీ కొత్త కొత్త ఫీచర్స్ తో ఆకట్టుకొనే విధంగా సరసమైనా ధరలతో కొత్త ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేస్తుంది.. రెడ్ మీ 12 ఫోన్ త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు ప్రకటించింది..రెడ్‌మి 12 ఫోన్ ఆగష్టు 1న భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ లాంచ్ ఈవెంట్ తేదీని బ్రాండ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఫోన్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెడ్‌మి ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కీలక వివరాలను రివీల్ చేసింది. క్రిస్టల్ గ్లాస్ డిజైన్, స్టైల్ ఐకాన్ కలిగిన ఈ రెడ్‌మి 12 ఫోన్ ఆగస్టు 1 న మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫీచర్స్…

రెడ్‌మి 12 ఫోన్ MediaTek Helio G88 ప్రాసెసర్ కలిగి ఉండనుంది. పోలార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ స్కై బ్లూ అనే 3 రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా, ఫోన్ 3 స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంది. 4GB RAM+128GB స్టోరేజ్, 8GB RAM +128GB స్టోరేజ్, 8GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌తో రానుంది. ఈ ఫోన్ 1TB వరకు స్టోరేజీని పెంచుకునేందుకు సపోర్ట్ చేస్తుంది. కెమెరా ఫీచర్లపరంగా ఈ ఫోన్ 8MP, 2MP కెమెరాలతో 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మాక్రో కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి..18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ డివైజ్‌కు పవర్ అందిస్తుంది. ఈ డివైజ్ ధర భారత మార్కెట్లో దాదాపు రూ. 15వేలకి అందుబాటులో ఉండవచ్చు..

ఇకపోతే రెడ్‌మి 12 స్పెక్స్ కంపెనీ ద్వారా ల్యాండింగ్ పేజీలో ఆవిష్కరించనుంది. భారత మార్కెట్లో లాంచ్ చేసిన ఫోన్‌లో స్వల్ప వ్యత్యాసాలతో స్పెక్స్ ఉండవచ్చు. గ్లోబల్ లాంచ్ సందర్భంగా లాంచ్ అయిన స్పెక్స్ గురించి మాట్లాడుతూ.. రెడ్‌మి 12 90Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.79-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వినియోగదారులకు సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ 168.60mm వెడల్పు, 76.28mm మందంతో ఉంది. ఈ ఫోన్ బరువు దాదాపు 198.5 గ్రాములు. రెడ్‌మి ఫోన్ 1080 x 2460 (FHD+) రిజల్యూషన్‌ను, అంగుళానికి 396 పిక్సెల్స్ (ppi) పిక్సెల్ సాంద్రతను అందిస్తుంది.. థాయ్ లాండ్ ఈ ఫోన్ ఖరీదు రూ.12, 400 ఉంది.. మరి ఇండియాలో ఎలా ఉంటుందో, ఏ వెరియంట్ లలో లభిస్తుందో తెలియాలంటే ఆగస్టు 1 వరకు ఆగాల్సిందే..

Exit mobile version