Redmi 12 Launch : రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్..ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రెడ్ మీ కొత్త కొత్త ఫీచర్స్ తో ఆకట్టుకొనే విధంగా సరసమైనా ధరలతో కొత్త ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేస్తుంది.. రెడ్ మీ 12 ఫోన్ త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు ప్రకటించింది..రెడ్‌మి 12 ఫోన్ ఆగష్టు 1న భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ లాంచ్ ఈవెంట్ తేదీని బ్రాండ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఫోన్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెడ్‌మి ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కీలక వివరాలను రివీల్ చేసింది. క్రిస్టల్ గ్లాస్ డిజైన్, స్టైల్ ఐకాన్ కలిగిన ఈ రెడ్‌మి 12 ఫోన్ ఆగస్టు 1 న మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫీచర్స్…
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
రెడ్‌మి 12 ఫోన్ MediaTek Helio G88 ప్రాసెసర్ కలిగి ఉండనుంది. పోలార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ స్కై బ్లూ అనే 3 రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా, ఫోన్ 3 స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంది. 4GB RAM+128GB స్టోరేజ్, 8GB RAM +128GB స్టోరేజ్, 8GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌తో రానుంది. ఈ ఫోన్ 1TB వరకు స్టోరేజీని పెంచుకునేందుకు సపోర్ట్ చేస్తుంది. కెమెరా ఫీచర్లపరంగా ఈ ఫోన్ 8MP, 2MP కెమెరాలతో 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మాక్రో కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి..18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ డివైజ్‌కు పవర్ అందిస్తుంది. ఈ డివైజ్ ధర భారత మార్కెట్లో దాదాపు రూ. 15వేలకి అందుబాటులో ఉండవచ్చు..
ఇకపోతే రెడ్‌మి 12 స్పెక్స్ కంపెనీ ద్వారా ల్యాండింగ్ పేజీలో ఆవిష్కరించనుంది. భారత మార్కెట్లో లాంచ్ చేసిన ఫోన్‌లో స్వల్ప వ్యత్యాసాలతో స్పెక్స్ ఉండవచ్చు. గ్లోబల్ లాంచ్ సందర్భంగా లాంచ్ అయిన స్పెక్స్ గురించి మాట్లాడుతూ.. రెడ్‌మి 12 90Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.79-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వినియోగదారులకు సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ 168.60mm వెడల్పు, 76.28mm మందంతో ఉంది. ఈ ఫోన్ బరువు దాదాపు 198.5 గ్రాములు. రెడ్‌మి ఫోన్ 1080 x 2460 (FHD+) రిజల్యూషన్‌ను, అంగుళానికి 396 పిక్సెల్స్ (ppi) పిక్సెల్ సాంద్రతను అందిస్తుంది.. థాయ్ లాండ్ ఈ ఫోన్ ఖరీదు రూ.12, 400 ఉంది.. మరి ఇండియాలో ఎలా ఉంటుందో, ఏ వెరియంట్ లలో లభిస్తుందో తెలియాలంటే ఆగస్టు 1 వరకు ఆగాల్సిందే..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!