144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • చైనాలో REDMAGIC 11S Pro, REDMAGIC 11S Pro+ స్మార్ట్‌ఫోన్ల లాంచ్
  • హై-పర్‌ఫార్మెన్స్ గేమింగ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా తీసుకొచ్చిన సిరీస్
  • Snapdragon 8 Elite Gen 5 Leading Edition ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరు..
Redmagic 11s Pro

Redmagic 11s Pro

REDMAGIC 11S Pro Series Launched: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి రెడ్ మ్యాజిక్ (REDMAGIC) నుండి REDMAGIC 11S Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్లను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. హై-పర్‌ఫార్మెన్స్ గేమింగ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ సిరీస్‌లో REDMAGIC 11S Pro, REDMAGIC 11S Pro+ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 Leading Edition ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు ఆకట్టుకోనున్నాయి.

ప్రీమియం డిజైన్, డిస్‌ప్లే:
ఈ కొత్త సిరీస్ ఫోన్లు ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో వచ్చాయి. ముందు భాగంలో ఎలాంటి కెమెరా హోల్ లేకుండా పూర్తి ఫుల్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. డ్యూటీరియం ట్రాన్స్పరెంట్ సిల్వర్ వింగ్, డ్యూటీరియం ట్రాన్స్పరెంట్ డార్క్ నైట్, డార్క్ నైట్, సిల్వర్ వింగ్ వారియర్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఫోన్‌లో 6.85 అంగుళాల 1.5K BOE X10 OLED డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 10-bit కలర్ డెప్త్, 100% DCI-P3 కలర్ గామట్ వంటి ఫీచర్లతో గేమింగ్, మల్టీమీడియా అనుభవం మరింత మెరుగ్గా ఉండనుంది. 95.3% స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఫుల్ వ్యూయింగ్ అనుభూతిని అందిస్తుంది.

కెమెరా, ఇతర ఫీచర్లు:
ఫోన్ వెనుక భాగంలో 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. AI ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.ఈ ఫోన్లలో 16MP అండర్-డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందుపరిచారు. టచ్ రెస్పాన్స్ కోసం Synaptics టచ్ చిప్‌ను ఉపయోగించారు. ఇది 3000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 360Hz మల్టీ-ఫింగర్ టచ్ సపోర్ట్‌ను అందిస్తుంది. వీటితోపాటు 3.5mm ఆడియో జాక్, DTS:X అల్ట్రా డ్యూయల్ స్పీకర్లు, IPX8 వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC వంటి ప్రీమియం ఫీచర్లు కూడా లభిస్తాయి.

ప్రాసెసర్:
REDMAGIC 11S Pro సిరీస్‌ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది Snapdragon 8 Elite Gen 5 Leading Edition చిప్‌సెట్. ఇది గరిష్టంగా 4.74GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. గేమింగ్ పనితీరును మరింత పెంచేందుకు Redcore R4 అనే ప్రత్యేక గేమింగ్ కో-ప్రాసెసర్‌ను కూడా ఇందులో అదనంగా అందించారు. ఇది టచ్ కంట్రోల్, లైటింగ్ ఎఫెక్ట్స్, సూపర్ ఫ్రేమ్, సూపర్ రెజల్యూషన్ ఫీచర్లను మెరుగుపరుస్తుంది.

భారీ బ్యాటరీ:
REDMAGIC 11S Proలో 8000mAh భారీ బ్యాటరీని అందించారు. REDMAGIC ఫోన్‌లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యమని కంపెనీ తెలిపింది. 11S Pro మోడల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తే, 11S Pro+ మోడల్‌లో 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. గేమింగ్ సమయంలో వేడి సమస్యను తగ్గించేందుకు REDMAGIC కొత్త ఎయిర్, వాటర్ కూలింగ్ కాంబినేషన్‌ను తీసుకొచ్చింది. విండ్ చేజర్ 4.0 యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ 24,000rpm వేగంతో పనిచేస్తుంది. అలాగే కొత్త పల్స్‌డ్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ ద్వారా ఫోన్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. AI సర్వర్లలో ఉపయోగించే ఫ్లోరినేటెడ్ లిక్విడ్‌ను ఇందులో ఉపయోగించడం విశేషం.

ధర:
REDMAGIC 11S Pro 12GB + 256GB వేరియంట్ ధర 5499 యువాన్ (సుమారు రూ.77,800)గా నిర్ణయించారు. ఇంకా REDMAGIC 11S Pro+ 12GB + 256GB వేరియంట్ ధర 6199 యువాన్ (సుమారు రూ.87,700), 16GB + 512GB వేరియంట్ ధర 6999 యువాన్ (సుమారు రూ.99,000), టాప్ ఎండ్ 16GB + 1TB మోడల్ ధర 7999 యువాన్ (సుమారు రూ.1.13 లక్షలు)గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్లు చైనాలో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.