REDMAGIC 11 Air: నూబియా (nubia) సంస్థ రెడ్‌మ్యాజిక్ సిరీస్‌లో లేటెస్ట్ గా రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ (REDMAGIC 11 Air)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన 10 ఎయిర్ కు ఇది సక్సెసర్. ఈ ఫోన్ లో 6.85 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2592Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది 95.1% స్క్రీన్-టు-బాడీ రేషియో, కేవలం 1.25mm అల్ట్రా-న్యారో బెజెల్స్ తోపాటు 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ముందుర 16MP అండర్-డిస్‌ప్లే కెమెరాను అందించారు.
Nari Nari Naduma Murari: శ్రీవిష్ణు స్థానంలో నేను ఉంటే చేసేవాడిని కాదు: శర్వానంద్ షాకింగ్ కామెంట్స్!
కేవలం 7.85mm మందంతో స్లిమ్‌గా ఉండే ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. Air సిరీస్‌లో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను పొందిన తొలి ఫోన్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ (3nm) ప్రాసెసర్ ను ఉపయోగించారు. దీనికి తోడు Redcore R4 గేమింగ్ చిప్, CUBE Sky Engine ఉన్నాయి. ఈ ఫోన్‌లో 12GB లేదా 16GB LPDDR5X ర్యామ్, 256GB లేదా 512GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 520Hz టచ్ రెస్పాన్స్ రేట్ గల ట్రిగ్గర్స్, ఇండస్ట్రీ-ఫస్ట్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఎయిర్ కూలింగ్ బ్రాకెట్, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, 4D అల్ట్రా-థిక్ VC కూలింగ్ వెంట్స్, అండర్-స్క్రీన్ గ్రాఫీన్ కాపర్ ఫాయిల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. REDMAGIC OS 11.0తో ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. ఇందులో బిల్ట్-ఇన్ PC ఎమ్యులేటర్, AI సెర్చ్, ఆబ్జెక్ట్ రికగ్నిషన్, ఫుల్ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, రియల్ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు AI గేమ్ సెర్చ్, AI టాక్టికల్ కోచ్ గేమ్‌ప్లే సమయంలో సలహాలు అందిస్తాయి.
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ బెదిరింపులతో రూ.9 లక్షల కోట్లు లాస్!
మొబైల్ క్వాంటమ్ బ్లాక్, స్టార్ డస్ట్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. మరోక కలర్ ‘అరోరా సిల్వర్’ మార్చిలో విడుదల కానుంది. 12GB + 256GB వేరియంట్ 3699 యువాన్స్ (రూ. 48,300)కు, 16GB + 512GB వేరియంట్ 4399 యువాన్స్ (రూ. 57,400)కు లభిస్తుంది. ఈ ఫోన్ చైనాలో జనవరి 20 నుంచి అమ్మకాలు జరగనున్నాయి. లాంచ్ ఆఫర్‌గా 200 యువాన్స్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
