ఆపిల్ ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మీరు కొత్త ఐఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16eని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ పై ఆపిల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్ రెడింగ్టన్ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. iPhone 16eపై రూ. 10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,900. ఆఫర్ యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే రూ. 49 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.
ఐఫోన్ 16e అనేది ఆపిల్ యొక్క ఐఫోన్ 16 సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతుంది. డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా.. ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు iPhone 16e కొనుగోలుపై రూ.4,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీని వలన ధర రూ.55,900 కు తగ్గుతుంది. కొత్త iPhone 16e పై రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. రెండు ఆఫర్లను యూజ్ చేసుకుని iPhone 16e కొనుగోలు చేస్తే రూ. 10 వేల తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 16e బేస్ 128GB మోడల్ ధర రూ.59,900. అదే 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,900 కాగా, 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.89,900.
Also Read:Maharashtra: ‘‘మహాయుతి’’లో చీలిక.. ఫడ్నవీస్, షిండేల మధ్య మరింత దూరం..?
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 16e లో A18 చిప్ అమర్చారు. Genmoji, రైటింగ్ టూల్స్, ChatGPT వంటి AI ఫీచర్ల అందించారు. ఈ ఫోన్ 8GB RAM సపోర్ట్ తో వస్తుంది. ఫేస్ ఐడి, USB-C పోర్ట్ సపోర్ట్ తో వస్తుంది. ఐఫోన్ 16e లో 48MP ఫ్యూజన్ వెనుక కెమెరా ఉంది. ఇది 2x టెలిఫోటో (డిజిటల్) జూమ్‌తో వస్తుంది. కెమెరాలో పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, HDR వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో ఆటోఫోకస్‌తో కూడిన 12MP ట్రూడెప్త్ కెమెరా ఉంది.