7.94mm అల్ట్రా స్లిమ్ డిజైన్ + పవర్‌ఫుల్ బ్యాటరీతో ఫిబ్రవరి 20న రాబోతున్న Realme P4 Lite 4G!

Realme P4 Lite 4g

Realme P4 Lite 4g

Realme P4 Lite 4G: రియల్‌మీ (realme) సంస్థ P సిరీస్‌ను భారత మార్కెట్‌లో మరింత పెంచేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తుంది. దీనికోసం కంపెనీ అధికారికంగా రియల్‌మీ పీ4 లైట్ 4G (realme P4 Lite 4G) స్మార్ట్‌ఫోన్‌ ను ఫిబ్రవరి 20న లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్‌ ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, స్లిమ్ డిజైన్‌పై దృష్టి పెట్టి యూత్ ను ఆకర్షించడానికి సిద్ధమైంది.

Ragi Burelu Recipe: రుచి, ఆరోగ్యం ఇచ్చే ‘రాగి బూరెలు’.. సూపర్ సాఫ్టిగా ఇంట్లోనే చేసేయండి ఇలా!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6300mAh బ్యాటరీ మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఈ సెగ్మెంట్‌ లో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ తెలిపింది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 7.94mm మాత్రమే ఉండటం విశేషం. అలాగే బాక్స్‌లోనే ఛార్జర్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్‌కు UNISOC తయారు చేసిన T7250 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉండనుంది. డ్యూరబిలిటీ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ కు IP54 రేటింగ్ ఇవ్వబడింది. అంతేకాదండోయ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా అందించనున్నట్లు సమాచారం. ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పలు AI ఆధారిత ఫీచర్లను అందించనున్నారు.

కొత్త A20 చిప్, శాటిలైట్ నెట్‌వర్క్ సపోర్ట్.. iPhone 18 Pro Seriesలో భారీ అప్‌గ్రేడ్లు!

ఈ ఫోన్ అధికారిక లాంచ్ ఫిబ్రవరి 20, 2026న జరగనుంది. ధర, అమ్మకాల వివరాలను అదే రోజు ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తంగా భారీ బ్యాటరీ, స్లిమ్ డిజైన్, AI ఫీచర్లతో రియల్‌మీ పీ4 లైట్ 4G యువతకు ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది.