NTV Telugu Site icon

Realme Neo 7 SE: టాప్ క్లాస్ ఫీచర్లతో.. 7000mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్..

Realme

Realme

Realme తన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్లతో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా మరో ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఏకంగా 7000mAh బ్యాటరీతో న్యూ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ నాలుగు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. రియల్‌మీ నియో సిరీస్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400-మాక్స్ చిప్‌సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది.

Also Read:Dwarapudi: ద్వారపూడిలో 60 అడుగుల ఆదియోగి విగ్రహం.. రేపే ప్రారంభం

Realme Neo 7 SE ధర విషయానికి వస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ చైనాలో CNY 1,799 (సుమారు రూ. 22,000) కు ప్రారంభించబడింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 12GB+256GB ధర CNY 1,899 (సుమారు రూ. 23,000), మూడవ వేరియంట్ 12GB+512GB ధర CNY 2,199 (సుమారు రూ. 26,000), టాప్ వేరియంట్ 16GB+512GB ధర CNY 2,499 (సుమారు రూ. 30,000). ఈ రియల్‌మీ ఫోన్ బ్లూ మెచా, డార్క్ ఆర్మర్డ్ కావల్రీ, వైట్ వింగ్డ్ గాడ్ ఆఫ్ వార్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Also Read:Jharkhand shocker: దారుణం.. పెళ్లి నుంచి వస్తున్న ఐదుగురు బాలికపై 18 మంది గ్యాంగ్ రేప్..

Realme Neo 7 SE ఫీచర్లు

Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K 8T LTPO డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఈ Realme ఫోన్ MediaTek Dimensity 8400-Max ప్రాసెసర్, 16GB వరకు RAM తో వస్తుంది. ఈ Realme ఫోన్ కూలింగ్ కోసం 7,700mm చదరపు VC హీట్ డిస్సిపేషన్ ఏరియాను కలిగి ఉంది. Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 కెమెరా సెన్సార్ ఉంది. ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా యాంగిల్ కెమెరాను అందించారు. దీనితో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు.

Also Read:Vizag: ఆందోళన బాట పట్టనున్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు..

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 ఆధారంగా Realme UI 15 పై పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, GPS, గెలీలియో, గ్లోనాస్, A-GNSS, NFC, Wi-Fi వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు, ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, కలర్ టెంపరేచర్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్, లైట్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, అండర్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఈ Realme ఫోన్ IP69 + IP68 + IP66 రేటింగ్‌తో వస్తుంది.