Site icon NTV Telugu

Realme Narzo 70 Pro 5G: నార్జో సిరీస్‌లో రియల్‌మీ నుంచి వస్తున్న మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?

Narzo

Narzo

ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది.. తాజాగా మరో ఫోన్ వచ్చేసింది..రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ గత ఏడాది విడుదలైన రియల్‌మీ నారో 60 ప్రో యొక్క వారసుడిగా ఇది రాబోతోంది. 2024 మార్చిలో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ లాంచ్ చేయబడుతుందని కంపెనీ ధృవీకరించింది. ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ కంపెనీ వెబ్ సైట్ లో మాత్రం దీని గురించి వివరాలను పొందుపరిచింది.. ఇకపోతే ఈ ఫీచర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఈ కొత్త నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెన్సార్లు మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. ప్రాథమిక కెమెరా కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్ ఉంటుందని ధృవీకరించబడింది.. రియల్‌మీ 12 ప్రో+కి రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. అయితే నార్జో 70 ప్రోలో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి ఇతర సెన్సార్‌లకు కొన్ని మార్పులు ఉండవచ్చు..

ఇకపోతే 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్డ్ AMOLED స్క్రీన్ కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 7s జెస్ 2 SoC ప్రాసెసర్ తో రియల్‌మీ నార్జో 70 ప్రో రావొచ్చు.. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీని ఆశించవచ్చు. ఇక మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉందని తెలుస్తుంది.. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది అనేది మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది కూడా తెలియలేదు.. త్వరలోనే ప్రకటన రావాల్సి ఉంటుందని సమాచారం..

Exit mobile version