Realme GT 8 Series: రియల్‌మీ జీటీ 8 సిరీస్ (Realme GT 8 Series) స్మార్ట్ ఫోన్లు వచ్చే నెలలో చైనాలో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియంది. రియల్‌మీ జీటీ 8 (Realme GT 8), రియల్‌మీ జీటీ 8 ప్రో (Realme GT 8 Pro) మోడళ్లను ఈ సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ల కోసం ప్రస్తుతం చైనాలో ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. రియల్‌మీ (Realme) తన అధికారిక పోస్ట్‌లో రియల్‌మీ జీటీ 8 సిరీస్ చైనాలో అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించింది. అయితే, కచ్చితమైన తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేసుకున్న Xiaomi 17 Series!
రియల్‌మీ జీటీ 8 సిరీస్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్ ఉచితంగా చేసుకోవచ్చని, అయితే చిన్న మొత్తంలో రుసుము చెల్లించిన కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. కొన్ని నివేదికల ప్రకారం, రియల్‌మీ జీటీ 8 సిరీస్ ఫోన్లలో వెనుకవైపు 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. ఈ మొబైల్స్ కో ఫ్లాట్ 2కే (flat 2K AMOLED display) అమోలెడ్ డిస్‌ప్లేను అందించనున్నారు. క్వాల్కమ్ నుంచి రాబోయే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ (Snapdragon 8 Elite Gen 5)తో విడుదలయ్యే మొదటి ఫోన్లలో ఈ సిరీస్ కూడా ఉండవచ్చని సమాచారం.
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్-2, 3 పార్టులు పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది
రియల్‌మీ జీటీ 8 ఫోన్‌లో 6.6 అంగుళాల స్క్రీన్ ఉండవచ్చు. అలాగే 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించే అవకాశం ఉంది. సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు మెటల్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ఫోన్ గత ఏడాది విడుదలైన రియల్‌మీ జీటీ 7 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా మార్కెట్లోకి వస్తుంది.
