NTV Telugu Site icon

Realme C67 4G Launch : అదిరిపోయే ఫీచర్స్ తో రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ధర కూడా తక్కువే..

Realmi

Realmi

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేస్తుంది.. ఇటీవల భారత మార్కెట్లో రియల్‌మి C67 5జీ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది.. 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ, 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.. అయితే ఈ మొబైల్ ను ఎప్పుడు మార్కెట్ లోకి తీసుకొస్తారో తెలియదు.. మార్కెట్ ఈ ఫోన్ కు డిమాండ్ పెరుగుతుంది..

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..

ఈ హ్యాండ్‌సెట్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. 5జీ వేరియంట్ మాదిరిగానే రియల్‌మి C67 4జీ ఫోన్ సన్నీ ఒయాసిస్ డిజైన్‌ను కలిగి ఉంది.. బయట ఎండ తగలగానే మెరుస్తుంది… క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్, అడ్రినో 610 జీపీయూ ద్వారా సపోర్టుతో రియల్‌మి C67 4జీ ఫోన్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 2టీబీ వరకు విస్తరించవచ్చు. అయితే ర్యామ్ వర్చువల్‌గా అదనంగా 8జీబీ వరకు పొడిగించవచ్చు..

అలాగే 4జీ మోడల్ 108ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్ఎం6 ప్రైమరీ సెన్సార్‌తో 3ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు వెనుకవైపు 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది.. కెమెరా విషయానికొస్తే.. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. రియల్‌మి సి67 4జీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.. అదే విధంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దాదాపు 185 గ్రాముల బరువు ఉంటుంది..

ఇక ధర విషయానికొస్తే.. 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ఇండోనేషియాలో ఐడీఆర్ 2,599,000 (సుమారు రూ. 13,900) ఉంటుంది. అయితే, 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ఐడీఆర్ 2,999,000 (సుమారు రూ. 16,100) వద్ద లిస్టు అయింది. ఈ ఫోన్ బ్లాక్ రాక్, సన్నీ ఒయాసిస్ కలర్‌వేస్‌లో అందిస్తుంది.. జనవరి 4 వరకు ఫ్రీ ఆర్డర్స్ అందుబాటులో ఉన్నాయి..