Site icon NTV Telugu

‘Urban Wild Design’ కాన్సెప్ట్‌తో కొత్త Realme 16 Pro Series.. మెరిసిపోనున్న మొబైల్ బ్యాక్ గ్రౌండ్స్..!

Realme 16 Pro Series

Realme 16 Pro Series

Realme 16 Pro Series: టీజర్ల తర్వాత రియల్‌మీ (Realme) ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నావోటో ఫుకసావా (Naoto Fukasawa)తో తన భాగస్వామ్యాన్ని మరోసారి అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ X, X2 Pro, GT సిరీస్‌ల తర్వాత ఇప్పుడు రాబోయే realme 16 Pro సిరీస్ కోసం ఈ సహకారం కొనసాగుతోంది. ఈసారి రియల్‌మీ పరిచయం చేస్తున్న కొత్త డిజైన్ కాన్సెప్ట్ పేరు “Urban Wild Design”. Realme 16 Pro సిరీస్ డిజైన్ ప్రకృతి స్పర్శను ఆధునిక నగర శైలితో మేళవించడం ప్రత్యేకత. కంపెనీ తెలిపిన ప్రకారం ‘Urban Wild’ కాన్సెప్ట్ ప్రకృతిని గుర్తు చేసే టెక్స్చర్‌ లైన గోధుమ పొలాలు, నదీ రాళ్ల వంటి అనుభూతిని స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో కలపడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సిరీస్‌లో ముఖ్యంగా బయో-బేస్డ్ ఆర్గానిక్ సిలికాన్ మెటీరియల్ ను వినియోగించారు. ఇది పునరుత్పాదక మొక్కల ఆధారిత స్ట్రా నుంచి తయారు చేయబడింది. ఈ మెటీరియల్ సాఫ్ట్ టచ్ అనుభూతిని అందిస్తూనే, దీర్ఘకాలిక మన్నికను కూడా కలిగి ఉంటుంది. రియల్‌మీ ప్రకారం ఇది ఏజింగ్, మురికి, బ్యాక్టీరియా, అబ్రేషన్లకు మంచి రెసిస్టెన్స్ ఇస్తుంది. ఈ రాబోయే Realme 16 Pro సిరీస్‌లో “All-Nature Curve” డిజైన్ ను ఉపయోగించారు. ఇది బ్యాక్ ప్యానెల్ నుంచి డిస్‌ప్లే వరకు ఉండనుంది. ఈ కొత్త డిజైన్ ఉన్నప్పటికీ ఫోన్ 8.49 మిమీ మందంతో స్లిమ్ ప్రొఫైల్ ను నిలుపుకుంది.

IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

ఈ సిరీస్‌లో మల్టీ-డైమెన్షనల్ కలర్ ట్యూనింగ్‌తో నాలుగు ప్రత్యేక రంగులను అందిస్తున్నారు. అయితే రంగుల లభ్యత మోడల్‌ను బట్టి మారుతుంది.

Master Gold: గోధుమ ధాన్యపు టెక్స్చర్ నుంచి ప్రేరణ పొందిన ఈ రంగు Realme 16 Pro+, Realme 16 Pro రెండింటికీ అందుబాటులో ఉంటుంది.

Master Grey: నదిలో పాలిష్ అయిన రాళ్ల రూపాన్ని ప్రతిబింబించే ఈ రంగు Realme 16 Pro+కు మాత్రమే ప్రత్యేకం.

Camellia Pink: భారతీయ పండుగల పూల నుంచి ప్రేరణ పొందిన ఈ కలర్ కూడా Realme 16 Pro+కు మాత్రమే లభిస్తుంది.

Orchid Purple: భారతీయ ఉత్సవాల వైభవాన్ని ప్రతిబింబించే ఈ రంగు realme 16 Proకు మాత్రమే ప్రత్యేకం.

కెమెరా మాడ్యూల్ & బిల్డ్ క్వాలిటీ:
ఫోన్ వెనుక భాగంలో “Metal Mirror Camera Deco” ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది Luxury PVD (Physical Vapor Deposition) టెక్నాలజీతో తయారై, హై-గ్లోస్ మిర్రర్ ఫినిష్‌ను అందిస్తుంది. స్క్రాచ్ రెసిస్టెన్స్ కోసం నానో-స్కేల్ మెటల్ కోటింగ్ ను కూడా ఉపయోగించారు. కెమెరా సెటప్‌ను “Volcanic Camera Deco” డిజైన్ లో అమర్చారు. ఇది బ్యాక్ ప్యానెల్‌తో సహజంగా కలిసిపోయేలా ఉండటంతో పాటు, మెటాలిక్ మిడ్-ఫ్రేమ్‌తో కలిపి స్ట్రక్చరల్ బలాన్ని, డిజైన్ బ్యాలెన్స్‌ను అందిస్తుంది.

Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనేవారికి బిగ్ షాక్..

realme 16 Pro సిరీస్‌లో LumaColor IMAGE టెక్నాలజీతో పాటు Urban Wild Design ఉండటం ఖరారైంది. అయితే అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ సిరీస్‌ను 2026 జనవరి ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.

Exit mobile version