NTV Telugu Site icon

Realme 11 Pro 5G: 200MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. రియల్‌మీ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌ బుకింగ్, ఆఫర్స్ డీటెయిల్స్ ఇవే!

Realme 11 Pro 5g

Realme 11 Pro 5g

Realme 11 Pro 5G Lunch Date in India: ‘రియల్‌మీ 11 ప్రో’ సిరీస్‌ ఇటీవలే భారతదేశంలో రిలీజ్ అయింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయడానికి మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రియల్‌మీ 11 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 11 ప్రో (Realme 11 Pro 5G), రియల్‌మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro+ 5G) స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. మేలోనే చైనాలో ఈ సీరీస్‌ రిలీజ్ కాగా.. భారతదేశంలో ఇప్పుడు విడుదల అయింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. జూన్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫాన్స్ విక్రయాలు ప్రారంభమవుతాయి. జూన్‌ 16 మధ్యాహ్నం నుంచి అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌, కొన్ని ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి వస్తాయి.

Realme 11 Pro 5G Specs:
రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తాయి. రెండింటిలోనూ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ (1,080×2,412 pixels) కర్వ్‌డ్‌ స్క్రీన్‌ ఉంటుంది. 6ఎన్‌ఎం ఆక్టాకోర్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ వీటిలో ఉంది. 12GB వరకు RAM మరియు 512GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

Realme 11 Pro 5G Price:
రియల్‌మీ 11 ప్రో 5జీ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.23,999లుగా ఉంది. 8GB + 256GB వేరియంట్‌ ధర రూ.24,999 కాగా.. 12GB + 256GB వేరియంట్‌ ధర రూ.27,999గా ఉంది. రియల్‌మీ 11 ప్రో ప్లస్ 5G 8GB + 256GB ధర రూ.27,999 కాగా.. 12GB + 256GB ధర రూ.29,999లుగా ఉంది. HDFC మరియు SBI కార్డ్‌లపై ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Also Read:
Ram Charan-Upasana: అద్భుతమైన 11 సంవత్సరాలు.. ఉపాసన కొణిదెల ట్వీట్ వైరల్!
Realme 11 Pro 5G Camera:
రియల్‌మీ 11 ప్రో ఫోన్‌లో 100 మెగా పిక్సెల్‌ కెమెరా (100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్) ఉంటుంది. రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్‌ కెమెరా (200-మెగాపిక్సెల్ Samsung HP3 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్) ఉంది. ప్రోలో 16 మెగాపిక్సెల్‌, ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

Realme 11 Pro 5G Battery:
రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 5000mAh బ్యాటరీతో రానున్నాయి. ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉండగా.. ప్రో స్మార్ట్‌ఫోన్‌ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ ఫాన్స్ మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

Show comments