NTV Telugu Site icon

RBI: ఆర్బీఐ @ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ

Rbi3

Rbi3

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులను, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్ల(ఎన్‌బీఎఫ్‌సీల)ను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారీగా ఉండే డేటాబేస్‌ను విశ్లేషించేందుకు కూడా ఇవి అవసరమని భావిస్తోంది. ఇందులో భాగంగా అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ మరియు మెషిన్‌ లెర్నింగ్‌లను వాడనుంది.

4 రోజుల్లో రూ.730 కోట్ల మద్యం సేల్స్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా పండుగను బాగా ఎంజాయ్‌ చేశారు. దీంతో 4 రోజుల్లోనే 730 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ ఖుషీ అవుతోంది. అయితే.. ఈ సేల్స్‌ తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి జరిగినవి మాత్రమేనని, ఇక.. మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల రిటైల్‌ విక్రయాలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ అమ్మకాలు రెట్టింపు సంఖ్యలో జరిగినట్లు తేలుతుందని అంటున్నారు. తెలంగాణ బేవరేజెస్‌ మద్యం డిపోలు రాష్ట్రవ్యాప్తంగా 19 ఉన్నాయి. వీటి ద్వారా 2 వేల 620 షాపులు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులకు మద్యం సప్లై అవుతుంది.

తెలంగాణలో ప్రతి సంవత్సరం దసరా సమయంలో మద్యం విక్రయాలు పెరుగుతుంటాయి. సాధారణంగా నిత్యం 80 నుంచి 90 కోట్ల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతాయి. కానీ.. ఈ నెల 1వ తేదీన మినహాయిస్తే మిగతా 3 రోజులూ రోజుకి రూ.100 కోట్లకు పైగానే సేల్స్‌ సాగాయి. ఆగస్టు 30వ తేదీన ఏకంగా 300 కోట్లకు పైగా విక్రయాలు చోటుచేసుకునట్లు తెలుస్తోంది.

read also: Rupee Hits Fresh Record Low: ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయికి రూపాయి.. 82 మార్క్‌ కూడా దాటేసింది..

యాక్టిస్‌తో మహింద్రా లైఫ్‌స్పేస్‌ జట్టు

మహింద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌.. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ యాక్టిస్‌తో జట్టు కట్టింది. దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీల అభివృద్ధి కోసం జాయింట్‌ వెంచర్‌ ద్వారా ప్రాథమికంగా 2 వేల 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ విషయాన్ని మహింద్రా లైఫ్‌స్పేస్‌ కంపెనీ.. రెగ్యులేటరీకి తెలియజేసింది. జాయింట్‌ వెంచెర్‌లో 26 శాతం నుంచి 40 శాతం వరకు వాటాను మహింద్రా లైఫ్‌స్పేస్‌ తీసుకుంటుంది. మిగిలిన షేరును యాక్టిస్‌ సొంతం చేసుకుంటుంది.