Haier M92 & M96 QD-Mini LED AI: హాయర్ అప్లయెన్సెస్ ఇండియా (Haier Appliances India) కొత్త M92, M96 QD-Mini LED AI టీవీ (Haier M92 & M96 QD-Mini LED AI) లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బార్డర్ లేని ప్రీమియం డిజైన్ ఈ టీవీల ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. 98% స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఇవి విజువల్ అనుభవాన్ని మరింత ఇమర్సివ్‌గా చేస్తాయి. మరి ఈ టీవీలలోని ఫీచర్స్ ను చూసేద్దామా..
డిస్‌ప్లే విషయంలో ఈ టీవీలలో QD Mini LED టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సహజమైన రంగులు, హైలైట్స్ అద్భుతంగా కనిపిస్తాయి. M92 (75”) మోడల్‌లో 576 డిమ్మింగ్ జోన్లు ఉండగా, M96 (100”) మోడల్‌లో మరింత పెద్ద స్క్రీన్ అనుభవం లభిస్తుంది. 99% DCI-P3 కలర్ గామట్ కవరేజ్, 16-బిట్ లైట్ కంట్రోల్, HDR10+ అడాప్టివ్, డాల్బీ విజన్ IQ వంటి ఫీచర్లు కలర్స్‌ను మరింత రిచ్‌గా చూపిస్తాయి. మరోవైపు ఆడియో విభాగంలో కూడా హాయర్ ప్రత్యేక శ్రద్ధ చూపింది. M92 మోడల్ KEF UK 2.1 చానెల్ సెటప్‌తో రాగా, M96 మోడల్ KEF UK 6.2.2 చానెల్ ఆడియో సిస్టమ్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్, టోటల్ సోనిక్స్ టెక్నాలజీతో క్లియర్ డైలాగ్స్, స్మూత్ సౌండ్ అనుభవం లభిస్తుంది.
ఇక గేమింగ్ ప్రేమికుల కోసం 144Hz రిఫ్రెష్ రేట్, VRR, ALLM, HDMI 2.1 సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా డాల్బీ విజన్ గేమింగ్, AMD ఫ్రీసింక్ ప్రీమియం ప్రో టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో పాటు.. గేమ్ మోడ్‌లు, షాడో ఎన్‌హాన్స్‌మెంట్, క్రాస్‌హైర్ అసిస్ట్ లాంటి ఫీచర్లతో ల్యాగ్-ఫ్రీ స్మూత్ గేమ్‌ప్లే అందుతుంది. ఇక ఇందులోని AI Ultra Sense ప్రాసెసర్ ఈ టీవీలకు ప్రధాన బలంగా చెప్పవచ్చు. AI Center MAX పిక్చర్, సౌండ్, గేమింగ్, ఎంటర్టైన్‌మెంట్ అన్నింటినీ ఆప్టిమైజ్ చేస్తుంది. AI సీన్ డిటెక్షన్ ద్వారా ముఖాలు, ఆకాశం, పచ్చదనం, భవనాలు, ఆహారం వంటి అంశాలు సహజంగా కనిపిస్తాయి. అలాగే ఇందులోని AI-Color Boost Pro, AI-HDR Enhancer Pro, AI-Depth, AI-Motion, AI-SR వంటి ఫీచర్లు పిక్చర్ క్లారిటీ, కలర్, డిటైల్‌ను మరింత మెరుగుపరుస్తాయి.
గూగుల్ స్పెషల్ యానిమేషన్.. Solar Eclipse అని సెర్చ్ చేశారో..!
స్మార్ట్ టీవీ అనుభవం కోసం Google TV OS తో వస్తున్న ఈ సిరీస్‌లో Google Assistant వాయిస్ కంట్రోల్, AI రికమెండేషన్స్ లభిస్తాయి. HaiSmart స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్, HaiCast ద్వారా ఆండ్రాయిడ్ లేదా విండోస్ నుంచి వైర్‌లెస్ ప్రొజెక్షన్ సౌకర్యం అందుతుంది. డిస్‌ప్లే ఆఫ్‌లో ఉన్నప్పటికీ ఆడియో వినేందుకు బ్లూటూత్ స్పీకర్ మోడ్ కూడా ఉంది. ఇక వీటి ధరలు చూస్తే, M92 సిరీస్ (75” / 65”) టీవీలు రూ. 1,05,990 నుండి అందుబాటులో ఉన్నాయి. అదే M96 సిరీస్ (100”) టీవీ ధర రూ. 3,99,999గా నిర్ణయించారు. ఇది సెప్టెంబర్ 30, 2025 నుంచి లభ్యం కానుంది. రెండు సిరీస్‌లకు మూడు సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది.
