Site icon NTV Telugu

Poco M8 5G Launch: 5,520mah బ్యాటరీ, 50MP కెమెరా.. పోకో ఎం8 5జీ వచ్చేసింది, 7వేల డిస్కౌంట్!

Poco M8 5g Launch

Poco M8 5g Launch

Poco M8 5G Launch in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘పోకో’ భారత మార్కెట్లో తన కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్‌, అధునాతన కెమెరా సెటప్‌, పెద్ద బ్యాటరీతో పోకో ఎం8 5జీ (Poco M8 5G)ను ఈరోజు లాంచ్ చేసింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారులే లక్ష్యంగా షావోమీ అనుబంధ సంస్థ అయిన పోకో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 4 ఏళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ తెలిపింది. పోకో ఎం8 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోకో ఎం8 5జీలో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 Gen 3 చిప్‌సెట్‌ను అందించారు. ఈ ప్రాసెసర్‌తో ఫోన్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అన్టుటు బెంచ్‌మార్క్‌లో ఈ డివైస్ 8,25,000కు పైగా స్కోర్ సాధించినట్లు పోకో వెల్లడించింది. ఈ ఫోన్‌లో LPDDR4x ర్యామ్‌తో గరిష్టంగా 8జీబీ ర్యామ్, అలాగే UFS 2.2 టెక్నాలజీతో 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. 6.77 ఇంచెస్ 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. Wet Touch 2.0 టెక్నాలజీ కారణంగా తడి చేతులతో కూడా స్మూత్‌గా ఫోన్‌ను ఉపయోగించవచ్చు.

ఫోటోగ్రఫీ విభాగంలో కూడా పోకో ఎం8 5జీ మంచి ఆకర్షణగా నిలుస్తుంది. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP లైట్ ఫ్యూజన్ 400 సెన్సర్ అందించారు. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, 2x ఇన్-సెన్సర్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,520mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, అలాగే 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. IP65, IP66 రేటింగ్స్ ఇందులో ఉన్నాయి. ఇవి ధూళి, నీటి నుంచి రక్షణను అందిస్తాయి. కేవలం 7.35 మిమీ మందంతో, సుమారు 178 గ్రాముల బరువుతో స్లిమ్ అండ్ లైట్ డిజైన్‌గా వచ్చింది.

Also Read: Flipkart Republic Day Sale 2026: కొత్త ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్‌ తొలి సేల్‌.. ‘రిపబ్లిక్‌ డే సేల్‌’ డేట్స్ ఇవే!

పోకో ఎం8 5జీ భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్+128GB స్టోరేజ్ ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.22,999గా.. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.24,999గా ఉంది. లాంచ్ ఆఫర్‌ కింద మొదటి 12 గంటల్లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆఫర్‌గా రూ.15,999కే ఈ ఫోన్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సాధారణ కొనుగోళ్లపై రూ.2 వేలు కార్డ్ డిస్కౌంట్, రూ.1000 అదనపు డిస్కౌంట్‌ ఉంటుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయలు ప్రారంభం కానున్నాయి. కార్బన్‌ బ్లాక్‌, గ్లాసియల్‌ బ్లూ సాహ ఫ్రాస్ట్‌ సిల్వర్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన ప్రాసెసర్‌, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో పోకో ఎం8 5జీ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

Exit mobile version