Perks cut in Google: టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న గూగుల్‌లో కొంత మంది ఉద్యోగుల ప్రోత్సాహకాలకు కోతపడనున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప బిజినెస్ ట్రావెల్స్‌కి అనుమతివ్వొద్దని సీనియర్ మేనేజర్లకు పైనుంచి మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ ఫంక్షన్లు, టీమ్ ఆఫ్‌సైట్లు, ఇన్-పర్సన్ ఈవెంట్స్‌కి ఇకపై అప్రూవల్ ఇవ్వబోమంటూ గూగుల్ ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్‌లకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు ఫ్రీ మీల్స్, ఆల్కహాల్, ఆన్‌సైట్ జిమ్‌లు తదితర ఇన్సెంటివ్‌లకు గూగుల్ పెట్టింది పేరు. కానీ.. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇతర సంస్థల మాదిరిగానే ఈ ఆఫర్లను కట్ చేస్తోంది.
బిలియన్ డాలర్లు కావాలి
సోమాలియా దేశంలో విలయతాండవం చేస్తున్న కరువు నివారణకు తక్షణం బిలియన్ డాలర్ల నిధులు కావాలని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల విభాగం చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ అన్నారు. కొన్నేళ్లుగా తిండికి తిప్పలు పడుతున్న ఈ ఆఫ్రికా దేశంలో రానున్న నెలల్లో మరియు వచ్చే ఏడాది తొలినాళ్లలో రెండుకు మించి డ్రై సీజన్లు నెలకొనే అవకాశం ఉందని అంచనా వేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కరువు పరిస్థితులు ఏర్పడనున్నాయని నిపుణుల కమిటీ తెలిపింది. దీంతో ఐక్యరాజ్యసమితి కోరుతున్న ఒకటీ పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు అదనంగా మరో బిలియన్ డాలర్లు అవసరమని మార్టిన్ గ్రిఫిత్ చెప్పారు.
Hyderabad’s Reality Boom: ఇదీ.. హైదరాబాద్ ‘రియల్’ డెవలప్‌మెంట్.
‘పీఎంశ్రీ’కి పచ్చజెండా
విద్యా ప్రమాణాల పెంపు కోసం ఉద్దేశించిన పీఎంశ్రీ పథకం అమలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం పచ్చజెండా ఊపింది. ఈ స్కీమ్‌లో భాగంగా దేశంలోని 14,500 లకుపైగా పాఠశాలల అభివృద్ధికి 27,360 కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని నిర్ణయించింది. ఈ పథకం గురించి ప్రధాని మోడీ కొద్ది రోజుల కిందటే వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలు నడిపే స్కూల్స్‌లో కొన్నింటిని సెలెక్ట్ చేసి వాటిని పీఎంశ్రీ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. అయితే.. ఈ పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. నాణ్యమైన విద్య లక్ష్య సాధనలో ఇది సముద్రంలోని ఒక నీటి చుక్కతో సమానమన్నారు.
