Site icon NTV Telugu

స్మార్ట్ ఫీచర్లు, 5-స్టార్ సేవింగ్స్.. Panasonic 1.5 Ton Split AC పై రూ. 24000 భారీ డిస్కౌంట్!

Ac

Ac

Panasonic 1.5 Ton Split AC: శివరాత్రి అయిపోయిందో లేదో.. అప్పుడే ఎండలు మొదలయ్యాయి. వేసవి కాలం వస్తుండడంతో.. ఇంట్లో చల్లదనాన్ని ఉంచేందుకు నాణ్యమైన ఏసీని కొనడం చాలా ముఖ్యం. దీనికోసం ఎయిర్ కండీషనర్ల విభాగంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ లలో ఒక్కటైన ‘పానాసోనిక్’ (Panasonic) స్మార్ట్ స్ప్లిట్ ఏసీని వినియోగదారుల ముందుకు తెచ్చింది. స్మార్ట్ ఫీచర్లు, పవర్ పొదుపు కలిసిన ఈ ఏసీపై ఇప్పుడు అమెజాన్‌లో అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..

Valentine’s Day Releases : వాలెంటైన్స్ డే రేస్‌లో మూడు సినిమాలు.. గెలిచిందెవరు?

ఈ ఏసీలోని ప్రధాన ఫీచర్లు:
7-ఇన్-1 కన్వర్టిబుల్ మరియు ట్రూ AI (True AI):
ఈ ఏసీలో ఉన్న ‘Converti7’ టెక్నాలజీ ద్వారా మీరు మీ అవసరాన్ని బట్టి 7 రకాల కూలింగ్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు. దీనిలోని ‘True AI’ మోడ్ గదిలోని ఉష్ణోగ్రతను, బయట వాతావరణాన్ని అంచనా వేసి, దానంతట అదే కూలింగ్ సెట్టింగ్స్‌ను మార్చుకుంటూ విద్యుత్‌ ను ఆదా చేస్తుంది.

స్మార్ట్ కంట్రోల్:
భారతదేశంలోనే మొట్టమొదటి ‘Matter’ సపోర్ట్ ఉన్న ఏసీలలో ఇది ఒకటి. పానాసోనిక్ ‘MirAIe’ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా మీ ఏసీని నియంత్రించవచ్చు. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా ద్వారా వాయిస్ కమాండ్స్‌తో కూడా దీనిని ఆపరేట్ చేయవచ్చు.

ఆరోగ్యకరమైన గాలి:
ఇందులో ఉన్న PM 0.1 ఫిల్టర్ గాలిలోని అతి సూక్ష్మమైన ధూళి కణాలు, కాలుష్య కారకాలను తొలగించి మీకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది.

అత్యుత్తమ పనితీరు:
బయట ఉష్ణోగ్రత 55 డిగ్రీల సెల్సియస్ ఉన్నా కూడా ఈ ఏసీ అద్భుతమైన చల్లదనాన్ని అందిస్తుంది. దీనిలోని ‘4-వే స్వింగ్’ (4-Way Swing) గదిలోని ప్రతి మూలకు సమానంగా గాలి అందేలా చేస్తుంది.

T20 World Cup 2026: గ్రూప్‌-బిలో తీవ్ర పోటీ.. సూపర్-8 బెర్త్ రేసులో జింబాబ్వే, ఆస్ట్రేలియా ఇంటికేనా?

వారంటీ:
100% కాపర్ కండెన్సర్, ‘Shield Blu+’ యాంటీ కొరోసివ్ కోటింగ్ వల్ల ఇది తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం పనిచేస్తుంది. కంపెనీ దీనిపై 1 సంవత్సరం కాంప్రహెన్సివ్ వారంటీ, 5 ఏళ్ల PCB వారంటీ, 10 ఏళ్ల కంప్రెషర్ వారంటీని అందిస్తోంది.

ధర తగ్గింపు:
పానాసోనిక్ ఈ ప్రీమియం స్మార్ట్ ఏసీ ధరపై ప్రస్తుతం అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. దీని అసలు ధర (M.R.P.) రూ. 64,400 కాగా, ప్రస్తుత ఆఫర్ ధర కింద కేవలం రూ. 41,390 (దాదాపు 37% వరకు తగ్గింపు) అంటే రూ. 24000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా మీరు ఇంకా 2,000 నుండి 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. అలాగే నెలకు రూ. 2,000 నుండి ప్రారంభమయ్యే నో కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version