Artificial intelligence (AI): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రస్తుతం ప్రపంచదేశాలు దృష్టి సారించాయి. అయితే కొంతమంది టెక్ దిగ్గజాలు ఏఐతో రాబోయ కాలంలో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తుండగా.. మరికొందరు మానవుల జీవనాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఇటీవల డీఫ్‌ఫేక్ వీడియోలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీల మార్ఫుడ్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఏఐని దుర్వినియోగం చేయడంపై ఏకంగా ప్రధాన మంత్రి మోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించే యాప్‌లు, వెబ్‌సైట్లకు ఇటీవల జనాదరణ పెరిగింది. ముఖ్యంగా ఫోటోలలోని మహిళల్ని న్యూడ్‌గా మార్చుతున్నారని బ్లూమ్‌బర్గ్ నుంచి వచ్చిన నివేదిక వెల్లడించింది. గ్రాఫికా అనే సోషల్ మీడియా నెట్వర్క్ ఎనాలిసిస్ సంస్థ తాజగా సంచలన రిపోర్టును విడుదల చేసింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 2.4 కోట్ల మంది ప్రజలు మహిళల్ని న్యూడ్‌గా చూపించే వెబ్‌సైట్లను సందర్శించారని, కృత్రిమ మేథతో అశ్లీలత పెరగడాన్ని నివేదిక హైలెట్ చేసింది.
Read Also: NTV Film Roundup: అమెరికాలో దేవరకొండ, హైదరాబాద్ లో రష్మిక.. ఊటీ చలిలో బాలయ్య!
‘న్యూడిఫై’ సర్వీసెస్‌గా పిలువబడే ఇలాంటి యాప్‌లు, వెబ్‌సైట్లు ఏకంగా తమ మార్కెటింగ్ కోసం ప్రసిద్ధ సోషల్ మీడియా నెట్వర్క్‌లని ఉపయోగించుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్(ట్విట్టర్), రెడ్డిట్ వంటి ఫ్లాట్‌ఫారమ్‌లలో ప్రకటన లింక్‌లు 2,400 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ.. వారిని అన్‌డ్రెస్‌గా చూపించేందుకు AI సాంకేతికతను ఉపయోగిస్తాయి. ఇలాంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రావడం వారి ప్రైవసీని ఆటంక పరుస్తోంది. దీంతో పాటు చట్టపరమైన, నైతిక సవాళ్లను తెస్తోంది.
ఇలా న్యూడ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాల్లో షేర్ కావడం, వారికి వేధింపులను పెంచుతోంది. అయితే తాజాగా గూగుల్ తన ప్రకటనల్లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌కి వ్యతిరేకంగా తన విధానాన్ని తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఏఐ సాంకేతికతతో డీప్‌ఫేక్, పోర్నోగ్రఫీ యొక్క తీవ్రత పెరగడం ప్రభుత్వాలతో పాటు ప్రజలను ఆందోళన పరుస్తోంది. ఇటీవల ఇండియాలో నటి రష్మికా డీప్‌పేక్ వీడియో వైరల్ కావడం, మరికొందరికి బాలీవుడ్ యాక్టర్స్ వీడియోలు, ఫోటోలు బయటకు రావడం ఆందోళల్ని పెంచింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా దీనిపై స్పందించారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ కూడా కఠిన నిబంధనలను తీసుకురావాలని కోరారు.