Site icon NTV Telugu

GlowShift కలర్ చేంజింగ్ డిజైన్ తో అచ్చం బంగారంలా మెరిసే కొత్త OPPO Reno14 5G Diwali Edition లాంచ్

Oppo Reno14 5g Diwali Edition

Oppo Reno14 5g Diwali Edition

OPPO Reno14 5G Diwali Edition: ఓప్పో (Oppo) భారత మార్కెట్‌లో ప్రత్యేకంగా Reno14 5G దివాళీ ఎడిషన్ (OPPO Reno14 5G Diwali Edition) లాంచ్ చేసింది. గతంలో మింట్ గ్రీన్ వేరియంట్‌ను విడుదల చేసిన కంపెనీ ఈసారి పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఇండస్ట్రీలోనే మొదటి హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీని అందించారు. GlowShift టెక్నాలజీ ద్వారా ఫోన్ వెనుక భాగం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా డీప్ ఫెస్టివ్ బ్లాక్ నుంచి రేడియంట్ గోల్డ్ కలర్‌కి మారుతుంది. ఈ ప్రక్రియలో ఆరు స్టెప్పులు, మూడు లేయర్లు, తొమ్మిది లామినేషన్ లేయర్లు ఉన్నాయి.

ఉష్ణోగ్రత 28 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు బ్లాక్, 29 నుంచి 34 డిగ్రీల మధ్యలో ట్రాన్సిషన్, 35℃ పైగా ఉన్నప్పుడు గోల్డ్ కలర్ గా మారుతుంది. ఇది కనీసం 10,000 సైకిల్స్ వరకు కలర్ చేంజ్ ఎఫెక్ట్ ను అందించేలా రూపొందించబడిందని ఓప్పో తెలిపింది.

కాంపాక్ట్ సైజ్‌లో పవర్‌ఫుల్ ఫీచర్స్ తో Xiaomi Pad Mini లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

OPPO Reno14 5G Diwali Edition స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.59 అంగుళాల 1.5K OLED (2760 × 1256 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్, 1200 nits బ్రైట్నెస్, 3840Hz PWM డిమ్మింగ్, Corning Gorilla Glass 7i

ప్రాసెసర్: 4nm Dimensity 8350, Octa Core (3.35GHz వరకు), Mali-G615 MC6 GPU

ర్యామ్ & స్టోరేజ్: 8GB LPDDR5X RAM, 256GB UFS 3.1 స్టోరేజ్

సాఫ్ట్‌వేర్: Android 15 with ColorOS 15

కెమెరా సెటప్: వెనుక 50MP ప్రైమరీ (IMX882, f/1.8, OIS), 8MP అల్ట్రావైడ్ (112°, f/2.2, OV08D), 50MP పెరిస్కోప్ 3.5X (JN5, f/2.8, OIS) లు.. ముందుభాగంలో 50MP (Samsung JN5, f/2.0). ఇవి 4K 60fps HDR వీడియో రికార్డింగ్ ను చేయగలవు.

బ్యాటరీ & ఛార్జింగ్: 6000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్.

ఇతర ఫీచర్స్: ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్, USB టైపు-C ఆడియో.

డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్: IP66 + IP68 + IP69

కనెక్టివిటీ: 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, GLONASS, Galileo, QZSS, Beidou

బరువు: 187 గ్రాములు

కొలతలు: 157.90×74.73×7.32mm

AP Legislative Council: కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ..! శాసన మండలిలో రచ్చ..

Oppo Reno14 5G దివాళీ ఎడిషన్ భారత మార్కెట్‌లో 8GB + 256GB వేరియంట్ రూ.39,999 ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రధాన రిటైల్ స్టోర్లలో ఒప్పో ఈ-స్టోర్ , ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం, అలాగే పాత ఫోన్ ఇచ్చి కొత్తదాన్ని కొనుగోలు చేసే కస్టమర్లకు 3,000 ఎక్స్చేంజ్ బోనస్ లాంటి ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి.

 

Exit mobile version