చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్‌ను భారత్‌లో జనవరి 8న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో Oppo Reno 15, Oppo Reno 15 Pro, Oppo Reno 15 Pro Mini మోడళ్లను లాంచ్ చేయనుంది. రెనో సిరీస్‌లో తొలిసారిగా చిన్న సైజ్‌లో వచ్చే ప్రో మినీ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒప్పో రెనో 15 స్టాండర్డ్ వేరియంట్‌లో 50MP ప్రైమరీ కెమెరాను అందించనుండగా.. 15 ప్రో, ప్రో మినీ మోడళ్లలో 200MP హై-రిజల్యూషన్ మెయిన్ సెన్సార్ ఉండనుంది. అంతేకాదు 50MP 3.5x టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్, 50MP అల్ట్రా వైడ్ కెమెరా (100 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ) కూడా ఉంటాయి.
ఒప్పో తీసుకొచ్చిన ప్యూర్ టోన్ టెక్నాలజీ కారణంగా ఫోటోలలో సహజమైన రంగులు, బ్యాలెన్స్‌డ్ టోన్ కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. రెనో 15 ప్రో, ప్రో మినీ మోడళ్లు అన్ని కెమెరాలతో (ఫ్రంట్ కెమెరా సహా) 4K HDR వీడియోను 60fps వరకు రికార్డ్ చేయగలవు. ఎలక్ట్రానిక్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వీడియో తీస్తూనే ఫోటోలు తీయడం, డ్యూయల్ వ్యూ రికార్డింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ మోడల్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP 3.5x టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 50MP అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు.
రెనో 15 ప్రో మినీ 6.32 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రెనో 15 6.59 అంగుళాల డిస్‌ప్లేను.. రెనో 15 ప్రో 6.78 అంగుళాల బిగ్ డిస్‌ప్లేతో వస్తుంది. అన్ని మోడళ్లలో ఫుల్ HD+ రిజల్యూషన్ ఉండగా, ప్రో మోడళ్లలో అధిక పీక్ బ్రైట్నెస్ లెవల్స్ ఉంటాయి. ఫోన్లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, Glacier Glow గ్లాస్ బ్యాక్, HoloFusion డిజైన్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. అలాగే IP66, IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, ధూళి నుంచి పూర్తి రక్షణ ఉంటుంది.
Also Read: AUS vs ENG 5th Test: ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. 277 వికెట్లు తీసిన బౌలర్ అరంగేట్రం!
15 సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ఉండనుందని సమాచారం. బ్యాటరీ సామర్థ్యం గరిష్టంగా 6,500mAh వరకు ఉండగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్లు Android 16 ఆధారిత ColorOS 16తో రానున్నాయి. లాంచ్ సందర్భంగా ఒప్పో రూ.99 ప్రివిలేజ్ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ ప్యాక్ కొనుగోలు చేసిన వారికి లాంచ్ డే రోజున స్పెషల్ ఆఫర్లు లభిస్తాయి. అలాగే Oppo Enco Buds3 Pro (Glaze White)పై 50% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 15 సిరీస్ ఫోన్లు అమెజాన్, ఒప్పో ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. 15 సిరీస్ తైవాన్‌లో రిలీజ్ అయింది. ఒప్పో రెనో 15 ప్రో ధర TWD 20,990 (సుమారు రూ.60,000)గా ఉంది.
