Site icon NTV Telugu

12.1 అంగుళాల 120Hz డిస్‌ప్లే, Dimensity 7300-Ultra చిప్‌సెట్, 10,050mAh బ్యాటరీతో Oppo Pad Air 5 లాంచ్..!

Oppo Pad Air 5

Oppo Pad Air 5

Oppo Pad Air 5: టెక్ దిగ్గజం ఒప్పో (Oppo) తన Pad Air సిరీస్‌లో భాగంగా కొత్త టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5 (Oppo Pad Air 5)ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త టాబ్లెట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. డిసెంబర్ 31 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది సాధారణ వేరియంట్లతో పాటు సాఫ్ట్ లైట్ (Soft Light) ఎడిషన్లలో కూడా లభించనుంది. ఈ టాబ్లెట్ Oppo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చైనాలో విక్రయించబడుతుంది. స్టార్ లైట్ పౌడర్, స్పేస్ గ్రే అనే రెండు రంగుల్లో ఇది లభిస్తుంది.

NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. దేశంలో భారీగా పెరగనున్న MBBS సీట్ల సంఖ్య

Oppo Pad Air 5 టాబ్లెట్ చైనాలో వివిధ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర CNY 1,899గా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 24,000కి సమానం. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను CNY 2,199 (రూ. 28,000) ధరకు, 12GB RAM + 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్‌ను CNY 2,499 (రూ. 32,000) ధరకు విక్రయించనున్నారు.

ఇక సాఫ్ట్ లైట్ ఎడిషన్ల విషయానికి వస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 2,399గా ఉండగా (రూ. 31,000), 12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న ప్రీమియం సాఫ్ట్ లైట్ వేరియంట్‌ను CNY 2,699 (రూ. 35,000) ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త Oppo Pad Air 5 స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో..

Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోడీ..

ఆపరేటింగ్ సిస్టమ్: Android 16 ఆధారిత ColorOS 16

డిస్‌ప్లే: 12.1-అంగుళాల LCD, 120Hz రిఫ్రెష్ రేట్, 2800×1980 పిక్సెల్ రిజల్యూషన్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 284 PPI, 540Hz టచ్ శాంప్లింగ్ రేట్, 7:5 ఆస్పెక్ట్ రేషియో, 98% DCI-P3 కలర్ గ్యామట్

ప్రాసెసర్: MediaTek Dimensity 7300-Ultra (ఆక్టా-కోర్, 2.5GHz వరకు క్లాక్ స్పీడ్)

GPU: Arm Mali-G615 MC2

ర్యామ్ & స్టోరేజ్: గరిష్టంగా 12GB LPDDR5x ర్యామ్, గరిష్టంగా 256GB UFS 3.1 స్టోరేజ్.

కెమెరా: రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్స్ (1080p @ 30fps వీడియో రికార్డింగ్), ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్స్ (సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం)

కనెక్టివిటీ & సెన్సార్లు: Wi-Fi 6, USB Type-C పోర్ట్, సెల్యులార్ వేరియంట్‌లో 5G, Beidou, GPS, GLONASS, Galileo, QZSS సపోర్ట్

సెన్సార్లు: అంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాక్సిలరోమీటర్, హాల్ ఎఫెక్ట్ సెన్సార్.

బ్యాటరీ & చార్జింగ్: 10,050mAh, 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్

సైజు: 266.01 × 192.77 × 6.83 మిమీ

బరువు: సుమారు 599 గ్రాములు.

Exit mobile version