OPPO K13 Turbo Series: భారత్‌లో ఒప్పో నేడు ఒప్పో K13 టర్బో సిరీస్ లో భాగంగా.. ఒప్పో K13 టర్బో (Oppo K13 Turbo), ఒప్పో K13 టర్బో ప్రో (Oppo K13 Turbo Pro) స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. జూలై నెలలో చైనాలో విడుదలైన ఈ మోడళ్లు నేడు భారత మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. మీడియం రేంజ్ సెగ్మెంట్ లో విడుదలైన ఈ మొబైల్స్ అనేక ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. మరి ఈ రెండు మొబైల్స్ లో ఏ ఫీచర్లను అందించారో పూర్తిగా చూసేద్దాం..
ప్రాసెసర్:
ఈ కొత్త ఒప్పో K13 టర్బోలో మీడియాటెక్ Dimensity 8450 చిప్‌సెట్ ను కలిగి ఉండగా, అదే Pro మోడల్‌లో స్నాప్ డ్రాగన్ 8s Gen 4 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ రెండు మొబైల్ మోడల్స్ లోను అత్యధికంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ సపోర్ట్ చేస్తాయి. ఈ మొబైల్స్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15.0.2 తో లాంచ్ అయ్యాయి. ఇక కంపెనీ ప్రకారం.. ఈ మొబైల్స్ లో రెండు సంవత్సరాల మెజర్ OS అప్‌డేట్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభించనున్నాయి.
Adaso Kapessa: 1985 నుంచి ఇదే ఫస్ట్.. ఎస్‌పీజీలో తొలి మహిళా ఆఫీసర్..!
కెమెరా సెటప్:
ఒప్పో K13 టర్బో (Oppo K13 Turbo), ఒప్పో K13 టర్బో ప్రో (Oppo K13 Turbo Pro) రెండు మోడళ్లలోనూ వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా అందించారు.
డిస్ప్లే అండ్ డిజైన్:
ఒప్పో K13 టర్బో సిరీస్ లోని రెండు మోడళ్ల మొబైల్స్ 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే (1,280×2,800 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 1,600 నిట్స్ గ్లోబల్ బ్రైట్నెస్ ను అందిస్తాయి. ఇక ఈ మొబైల్స్ కు IPX6, IPX8, IPX9 వంటి వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో నీటి తుంపర్ల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
బ్యాటరీ అండ్ కూలింగ్ చాంబర్:
ఈ రెండు కొత్త మొబైల్స్ లో 7,000mAh భారీ బ్యాటరీతో పాటు 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ అందించనున్నారు. అలాగే ఇవి బైపాస్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. వీటితోపాటు థర్మల్ మేనేజ్మెంట్ కోసం 7,000 sq mm వేపర్ కూలింగ్ చాంబర్, ఇన్‌బిల్ట్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్ కూడా లభించనున్నాయి.
Prabhas : గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ప్రకటన
ధర:
OPPO K13 టర్బో మొబైల్ లో మిడ్నైట్ మావెరిక్, వైట్ నైట్, పర్పుల్ ఫాంటమ్ వంటి మూడు రంగులలో లభ్యం అవుతుంది. ఈ మొబైల్ 8GB + 128GB వెర్షన్ ధర రూ.27,999 కాగా, 8GB + 256GB వెర్షన్ ధర రూ.29,999గా నిర్ణయించారు. ఇక ఒప్పో K13 టర్బో ప్రో మోడల్ సిల్వర్ నైట్, మిడ్నైట్ మావెరిక్, పర్పుల్ ఫాంటమ్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ 8GB + 256GB వెర్షన్ ధర రూ.37,999 కాగా, అదే 12GB + 256GB వెర్షన్ ధర రూ.39,999గా ఉంది.
వీటితోపాటు, OPPO టర్బో బ్యాక్ క్లిప్ ధరను రూ.3,999గా నిర్ణయించారు. ఇవన్నీ ఆగస్టు 18 నుండి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఇంకా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యం కానున్నాయి. ఇక వీటికి సంబంధించి ప్రీ-ఆర్డర్లు ఈరోజు నుండే మొదలుకానున్నాయి.
