Site icon NTV Telugu

OPPO K13 Price Hike: షాకింగ్.. తగ్గాల్సింది పోయి భారీగా పెరిగిన ‘ఒప్పో కే13’ ధర!

Oppo K13 5g Price Hike

Oppo K13 5g Price Hike

OPPO K13 5G Price Hike in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘ఒప్పో’.. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్ ఇచ్చింది. తన మిడ్‌రేంజ్ 5G ఫోన్ ‘ఒప్పో కే13’ 5G ధరను ఒక్కసారిగా పెంచింది. లాంచ్ సమయంలో సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌పై ఇప్పుడు ధరను భారీగా పెంచింది. ఒప్పో కే13 రిలీజ్ 2025 ఏప్రిల్ మాసంలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ధర తగ్గాల్సింది పోయి పెరడగంతో మొబైల్ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

లాంచ్ టైమ్‌లో ఒప్పో కే13 5G రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉండగా.. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.19,999కి విడుదల చేసింది. ఈ ధరలతో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఒప్పో ఈ ఫోన్ ధరలను గణనీయంగా పెంచింది. కొత్త ధరల ప్రకారం.. 8GB + 128GB వేరియంట్ రూ.22,999కి చేరింది. 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. అంటే రెండు వేరియంట్లపై కూడా రూ.5,000 మేర ధర పెరిగింది.

ధర పెంపుకు సంబంధించి ఒప్పో అధికారికంగా ఎలాంటి స్పష్టమైన కారణం వెల్లడించలేదు. అయితే పెరిగిన తయారీ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధర పెంపుతో OPPO K13 5G ఇప్పుడు ఇతర బ్రాండ్ల ఫోన్లతో మరింత గట్టి పోటీ ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికీ ఇది నిరాశ కలిగించే వార్తే. ప్రస్తుతం OPPO K13 5G కొనాలా? లేక ప్రత్యామ్నాయాలను చూడాలా? అన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది.

Also Read: Xiaomi 18 Concept Design: నాలుగు 50MP కెమెరాస్, 6600mAh బ్యాటరీ.. హై-ఎండ్ ఫీచర్లతో వస్తున్న షావోమీ 18!

OPPO K13 Specs:
# 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష రేటు, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# ఆండ్రాయిడ్‌ 15 (కలర్‌ ఓఎస్‌ 15)
# స్నాప్‌డ్రాగన్‌ 6జనరేషన్‌ 4 ప్రాసెసర్‌
# వెనుకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా
# 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Exit mobile version