Oppo Find X9s: ఒప్పో సంస్థ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన ఫైండ్ X9 లైనప్‌ను భారత్‌లో మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా కొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9sను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తాజా లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు గతంలోనూ లీక్ కాగా, తాజాగా మరోసారి కీలక స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్ 2026 ప్రారంభంలో లాంచ్ కావొచ్చని టెక్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అయితే, ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే ఫైండ్ X9s పరిమాణం చిన్నదిగా ఉండబోతుంది. ఇది ఒప్పో ఫైండ్ X8sను పోలి ఉండే ఛాన్స్ ఉందని టాక్. ఇప్పటికే ఒప్పో ఫైండ్ X9 ప్రో, స్టాండర్డ్ ఫైండ్ X9 మోడళ్లను కంపెనీ గత నవంబర్‌లో భారత మార్కెట్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Read Also: Rishabh Pant: నేడే న్యూజిలాండ్‌తో వన్డేలకు టీమిండియా జట్టు ఎంపిక .. పంత్‌కు ఛాన్స్ ఉందా?
భారత్‌లో లాంచ్ టైమ్‌లైన్..
అయితే, టిప్‌స్టర్ డెబయాన్ రాయ్ తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో.. ఒప్పో ఫైండ్ X9s స్మార్ట్‌ఫోన్ 2026 మార్చి నెలలో లాంచ్ కావొచ్చని పేర్కొన్నారు. ఈ ఫోన్ భారత్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ, కంపెనీ నుంచి ఇప్పటి వరకు మాత్రం అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ సమాచారం పట్ల వినియోగదారులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, ఫైండ్ X8s మోడల్ భారత్‌లో విడుదల కాకపోవడం వల్ల, ఫైండ్ X9s భారత్‌లో లాంచ్ అవుతుందా అనే సందేహాలు ఉన్నాయి.
Read Also: Story Board: తెలుగు రాజకీయాల్లో ఈ పాతికేళ్లు ఏం జరిగింది..? చరిత్రలో కీలక పరిణామాలేంటి..?
స్పెసిఫికేషన్లు
ఒప్పో ఫైండ్ X9sలో 6.3 ఇంచుల AMOLED లేదా OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది. LTPS టెక్నాలజీతో రూపొందిన ఈ స్క్రీన్, అవసరాన్ని బట్టి రిఫ్రెష్ రేట్‌ను మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం. ఇక, పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9500+ చిప్‌సెట్ ఉండనుంది. దీంతో ఇది పూర్తిస్థాయి ఫ్లాగ్‌షిప్ పని తీరును అందించే స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది.
కెమెరా, బ్యాటరీ హైలైట్స్
ఒప్పో ఫైండ్ X9sలో పూర్తిగా కొత్త రియర్ కెమెరా సెటప్ ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, అలాగే, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫైండ్ X8sలో ఉన్న హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన మూడు 50MP కెమెరాల సెటప్‌తో పోలిస్తే భారీ మార్పుగా భావించవచ్చు. బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. 6.3 ఇంచుల డిస్‌ప్లే ఉన్న ఫోన్‌లోనే భారీ 7,000mAh బ్యాటరీ ఇవ్వాలని ఒప్పో యోచిస్తున్నట్టు సమాచారం. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఇతర ఫీచర్లు
ఇతర ఫీచర్లలో అండర్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెటల్ ఫ్రేమ్, అలాగే నీరు- ధూళి నిరోధకత కోసం IP68 లేదా IP69 రేటింగ్ ఉండవచ్చని సమాచారం. కాగా, ప్రస్తుతం ఫైండ్ X9 సిరీస్‌లో ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో మోడళ్లు మాత్రమే ఉన్నాయి. ఒప్పో ఫైండ్ X8s మోడల్‌ను కంపెనీ గ్లోబల్‌గా విడుదల చేసినప్పటికీ, భారత్‌లో లాంచ్ చేయలేదు. అందువల్ల, ఫైండ్ X9s నిజంగా భారత మార్కెట్‌లోకి వస్తుందా లేదా అనేది మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.
