Online Games: మన దేశంలో సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సరికొత్త 5జీ ఆవిష్కరణలు ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీని నూతన శిఖరాలకు చేర్చనున్నాయి. ఇండియాలో ప్రస్తుతం 42 కోట్ల మంది యాక్టివ్ ఆన్‌లైన్ గేమర్లు, 50 కోట్ల మంది యంగ్ డిజిటల్ యూజర్లు ఉన్నారు. ఈ విషయాలను ఇండస్ట్రీ నిపుణులు ఇండియా గేమింగ్ కాన్‌క్లేవ్ సెకండ్ ఎడిషన్ సమావేశంలో వెల్లడించారు.
‘వేదాంత’ లక్ష్యం
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వేదాంత సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 17 బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించింది. సంస్థ అభివృద్ధితోపాటు సహజ వనరుల గుర్తింపు మరియు తవ్వకాల కోసం వచ్చే రెండేళ్లలో సుమారు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అనిల్ అగర్వాల్ తెలిపారు.
KG to PG First Campus: ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ‘కేజీ టు పీజీ’ ఫస్ట్ క్యాంపస్
పరిమితి ఎత్తివేత
దేశీయ విమాన టికెట్ల ధరలపై పరిమితిని ఈ నెలాఖరు నుంచి ఎత్తివేయాలని పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికుల ఛార్జీలను పెంచేందుకు ఎయిర్‌లైన్స్‌కి అవకాశం లభించనుంది. లాక్‌డౌన్ తర్వాత 2020 మే నెలలో ప్యాసింజర్ల సంఖ్యతోపాటు టికెట్ల రేట్లపైన కేంద్ర ప్రభుత్వం లిమిట్ పెట్టింది. ప్రయాణికుల సంఖ్య పైన విధించిన పరిమితిని మాత్రం గత అక్టోబర్‌లో తొలగించింది. ఇప్పుడు టికెట్ల రేటు పైనా లిమిట్‌ని ఎత్తివేస్తోంది.
ఫండ్ రైజింగ్
ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఫండ్ రైజింగ్‌పై ఫోకస్ పెట్టాయి. విడతల వారీగా బాండ్లను విక్రయించటం ద్వారా 8 వేల కోట్ల రూపాయల వరకు సేకరించనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల కోట్లను, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 నుంచి 4 వేల కోట్లను తమ ఖజానాలకు సమీకరించుకోనున్నాయి.
ఉక్రెయిన్‌కి ఊరట
రష్యాతో యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్‌కి కాస్త ఊరట లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండేళ్లపాటు రుణాల చెల్లింపులు చేయలేమన్న ఉక్రెయిన్ నిస్సహాయతని విదేశీ ఆర్థిక సంస్థలు పెద్ద మనసుతో మన్నించాయి. ఇంటర్నేషనల్ బాండ్ల జారీ ద్వారా తీసుకున్న దాదాపు 20 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ తిరిగి కట్టాల్సి ఉంది.
ప్రస్తుత ధరలు
24 క్యారెట్ల నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 660 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం 51 వేల 650 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర కూడా నిన్నటి కన్నా 600 రూపాయలు తక్కువే ఉంది. మరో వైపు.. వెండి రేటు నామమాత్రంగా 300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 58 వేల 700 రూపాయల వద్ద కొనసాగుతోంది.