Site icon NTV Telugu

9000mAh బ్యాటరీ, Snapdragon 7s Gen 4 చిప్‌తో OnePlus Turbo V ఫోన్ స్పెక్స్ లీక్..

Oneplus

Oneplus

OnePlus Turbo V: వన్ ప్లస్ (OnePlus) తాజాగా చైనాలో వన్ ప్లస్ టర్బో (Turbo) సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే PLU110 మోడల్ నంబర్‌తో AnTuTu లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు అదే సిరీస్‌కు చెందిన గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ CPH2805 కాగా.. ఇది గ్లోబల్ మార్కెట్‌లో OnePlus Nord సిరీస్ ఫోన్‌గా లాంచ్ అవుతుందని సమాచారం.

Minister Atchannaidu: ‘మీ చేతికి మీ భూమి – 22ఏ భూ స్వేచ్ఛ’.. ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు..

డిజైన్ పరంగా ఈ ఫోన్ వన్ ప్లస్ 15Rను పోలి ఉంది. వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా.. ముందు వైపు లేటెస్ట్ వన్ ప్లస్ ఫోన్ల మాదిరిగానే కనిపిస్తుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ అది మెటల్ లుక్ ఇస్తుండగా, బ్యాక్ ప్యానెల్‌పై ప్రత్యేకమైన ప్యాటర్న్స్ ఉన్నాయి. చైనాలో ఈ ఫోన్ వన్ ప్లస్ టర్బో Vగా యూనిక్ బ్లాక్, నోవా వైట్, ఫియర్‌లెస్ బ్లూ కలర్స్‌లో లాంచ్ కానుంది.

ఈ లీక్ ద్వారా కొత్త స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 SoC, భారీ 9000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి కీలక ఫీచర్లు బయటపడ్డాయి. అయితే చైనీస్ వేరియంట్‌లో 165Hz డిస్‌ప్లే ఉండగా, గ్లోబల్ వేరంట్‌లో మాత్రం 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ చైనాలో 2026 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉండగా భారత్‌లో OnePlus Nord CE సిరీస్ కింద మార్చి 2026లో బ్లూ, బ్లాక్ కలర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..

OnePlus Turbo V (గ్లోబల్) స్పెసిఫికేషన్లు: (అంచనా)

* 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే (144Hz వరకు రిఫ్రెష్ రేట్)

* Snapdragon 7s Gen 4 ప్రాసెసర్

* 8GB LPDDR5X ర్యామ్, 128GB / 256GB స్టోరేజ్

* Android 16 ఆధారిత OxygenOS 16

* 50MP OIS రియర్ కెమెరా + 8MP అల్ట్రా వైడ్, 32MP ఫ్రంట్ కెమెరా

* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

* 9000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్.

Exit mobile version