OnePlus Nord CE 6: వన్‌ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్‌లో
- వన్‌ప్లస్ నార్డ్ CE6 విడుదల
- 8000mAh బ్యాటరీ
- Snapdragon 7s Gen 4 చిప్‌సెట్
- 32MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్‌ప్లస్ భారత్ లో వన్‌ప్లస్ నార్డ్ CE6 ను విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ CE6 మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో పవర్, బ్యాటరీ, డిస్ప్లే, గేమింగ్ అనుభవం మీద ఫోకస్ పెట్టిన కొత్త 5G ఫోన్. ఈ ఫోన్‌లో 144Hz 1.5K AMOLED డిస్ప్లే, Snapdragon 7s Gen 4 చిప్‌సెట్, భారీ 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP OIS కెమెరా, 32MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. OnePlus దీనిని “Crazy Power. Pure Play.” అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K AMOLED ప్యానెల్ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, 1800 nits HBM బ్రైట్‌నెస్, Aqua Touch 2.0 వంటి ఫీచర్లు దీన్ని గేమింగ్, స్క్రోలింగ్, అవుట్‌డోర్ యూజ్‌కు బలమైన ఆప్షన్‌గా నిలబెడతాయి. ఇంకా Crystal Guard డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా ఉంది.
Also Read
- Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
- Flosenso Pro: ఇక ట్యాంక్ చూడాల్సిన పనిలేదు.. మొబైల్లోనే వాటర్ ట్యాంక్ లెవల్, మోటార్ ను కంట్రోల్ చేసే గాడ్జెట్
- Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
- WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ఉత్కంఠ..
పనితీరు ఎలా ఉంది?
Nord CE6 లో Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ ఉంది. OnePlus ప్రకారం ఇది 4nm TSMC ప్రాసెస్‌పై నిర్మించారు. గేమింగ్ కోసం Dedicated Touch Reflex Chip, 3200Hz instant touch sampling, 6-axis gyroscope, X-axis linear motor, పెద్ద VC cooling system వంటి అంశాలు ఇవ్వడం గమనించాల్సిన విషయం. అంటే BGMI, COD Mobile, హై రిఫ్రెష్ గేమింగ్ వాడే వారికి ఇది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన హైలైట్
ఈ ఫోన్‌లో 8000mAh భారీ బ్యాటరీ ఉంది. 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W wired reverse charging కూడా ఉంది. దీర్ఘకాల బ్యాటరీ బ్యాకప్ కోరుకునే యూజర్లకు ఇదే ఈ ఫోన్‌లో అతిపెద్ద selling point అని చెప్పొచ్చు. OnePlus అధికారిక పేజీలో “2.5+ days of power” అని కూడా పేర్కొంది.
కెమెరాలు
OnePlus Nord CE6 వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా dual-axis OISతో వస్తుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా autofocusతో ఉంటుంది. ముఖ్యంగా ముందు, వెనుక రెండు కెమెరాల నుంచీ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇవ్వడం మంచి విషయం. AI Portrait Glow, AI Eraser, AI Perfect Shot, AI Unblur వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ OxygenOS 16 మీద, Android 16 ఆధారంగా నడుస్తుంది. Google Gemini integration కూడా ఉంది. రోజువారీ ఉపయోగంలో AI ఆధారిత ఎడిటింగ్, స్మార్ట్ ఫీచర్లు, మెరుగైన UI అనుభవం కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
Nord CE6 కి IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. అదనంగా MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. అంటే దుమ్ము, నీరు, కఠిన వాతావరణ పరిస్థితుల విషయంలో ఇది సాధారణ మిడ్-రేంజ్ ఫోన్ల కంటే మరింత బలంగా ఉండొచ్చు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది: Fresh Blue, Lunar Pearl, Pitch Black. Source
ధర & వేరియంట్లు
భారతదేశంలో OnePlus Nord CE6 రెండు వేరియంట్లలో లాంచ్ అయింది:
8GB RAM + 128GB స్టోరేజ్ -రూ.29,999
8GB RAM + 256GB స్టోరేజ్ -రూ.32,999
కొన్ని బ్యాంక్ కార్డులతో రూ.2,000 instant discount లభిస్తే, effective ధరలు వరుసగా రూ.27,999, రూ.30,999 వరకు పడిపోతాయి. కొన్ని కార్డులపై 6 నెలల వరకు no-cost EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.
సేల్ ఎప్పుడు మొదలవుతుంది?
ఈ ఫోన్ విక్రయాలు మే 8, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. Amazon India, OnePlus India వెబ్‌సైట్, OnePlus Store App, OnePlus Experience Stores, అలాగే కొన్ని ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో ఇది అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
-
Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
-
Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
-
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
-
Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!