NTV Telugu Site icon

OnePlus Nord CE 4 Lite 5G : వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ వచ్చేస్తుంది.. ధర, ఫీచర్స్?

Oneplus 11r

Oneplus 11r

ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ఫోన్లకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం.. సరికొత్త ఫీచర్స్ తో వస్తున్న మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా మరో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వన్‌ప్లస్ నుంచి జూన్ 24న ఈ కొత్త ఫోన్ రాబోతుందని తెలుస్తుంది. కొత్త వెర్షన్‌తో మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. లాంచ్ ఈవెంట్‌కు ముందు వన్‌ప్లస్ కొన్ని ఫీచర్లను కూడా ధృవీకరించింది. అన్ని కోణాల నుంచి డిజైన్‌ను కూడా వెల్లడించింది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ కొత్త ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఓ లుక్ వేద్దాం పదండీ..

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ కలిగి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఛార్జింగ్ టెక్నాలజీ తో సపోర్ట్ చేసే 5,500 mAh బ్యాటరీని అందించనుంది.. అలాగే ఈ ఫోన్ ను తడి చేతులతో కూడా ఆపరేట్ చేయొచ్చని చెబుతున్నారు.. ఈ ఫోన్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో పనిచేసే 6.67 అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే సెన్సార్‌లతో పాటు 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.. సెల్ఫీలకు అదిరిపోయే కెమెరాను 16 ఎంపీ ప్రంట్ కెమెరాను అందించారు..

ఈ సరికొత్త ఫీచర్స్ రాబోతున్న వన్ ప్లస్ ధర విషయానికొస్తే.. గతంలో వచ్చిన 4 లైట్ ఫోన్ల కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.. అంటే అందుతున్న సమాచారం ప్రకారం ఈ కొత్త ఫోన్ దాదాపుగా 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 24,999 కి విక్రయిస్తోంది. ఇక కొత్తగా లాంచ్ కాబోతున్న ఈ కొత్త ఫోన్ ను వన్ ప్లస్ స్టోర్లలోను, లేదా అమెజాన్ లో కొనుగోలు చెయ్యొచ్చు.. ఈ మొబైల్స్ ఈరోజే లాంచ్ కాబోతుంది..