NTV Telugu Site icon

OnePlus Nord 3: వన్ ప్లస్ నార్డ్ 3 ఫోన్ ఫీచర్ లీక్.. ధర ఎంతో తెలుసా?

Ondplus

Ondplus

ఐఫోన్ తో సమానంగా ఫీచర్స్ ను కలిగి ఉన్న ఫోన్ వన్ ప్లస్.. ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుంది.. మార్కెట్ లోకి రాకముందే ఆ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నార్డ్ సిరీస్ ను పరిచయం చేసింది. తక్కువ ధరలతో వస్తున్న ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో సక్సెస్ అయ్యాయి. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ జనరేషన్ ఫోన్లు రిలీజ్ అయ్యి హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పుడు నార్డ్ థర్డ్ జనరేషన్ ఫోన్, వన్‌ప్లస్ నార్డ్ 3 కూడా ఇండియన్ మార్కెట్లలో రిలీజ్ కానుంది. అయితే దీని ఫీచర్లు తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

ఫీచర్లు..

ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం..వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 6.7-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, Mali G710 GPU, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP + 8MP + 2MP) ఉంటుంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా కస్టమ్ OSపై రన్ అవుతుందని, 5,000mAh బ్యాటరీ కెపాసిటీ ఉండనుంది.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చని తెలుస్తోంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G సపోర్ట్, స్టీరియో స్పీకర్లు, టైప్-సి ఆడియో పోర్ట్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయని తెలుస్తుంది.. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్స్ లో ఉండనున్నాయని సమాచారం..

ధర..

ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో రెండు వేరియంటలలో వస్తుంది.. ఇందులో ఒక మోడల్ 8GB RAM + 128GB స్టోరేజీతో వస్తుండగా.. దీని ధర రూ.32,999 ఉంటుందని చెప్పారు. రెండో వేరియంట్‌ 16GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని ధరను రూ.36,999గా కంపెనీ నిర్ణయించినట్లు ఆన్ లైన్ లో తెలిపారు.. మరో విధంగా ధర ఉండవచ్చునని అంచనా.. నార్డ్ 8GB+128GB స్టోరేజీ వేరియంట్ ప్రారంభ ధర 449 యూరోలు (సుమారు రూ.40,200) ఉండవచ్చు. మరో మోడల్ 12GB+256GB స్టోరేజీతో 549 యూరోల (సుమారు రూ.49,200) ధరతో లాంచ్ కావచ్చు.. ఇక ఈ ఫోన్ సుమారుగా 116 గ్రాముల బరువు ఉన్నట్లు సమాచారం.. ఈ ఫీచర్స్ లీక్ తో మార్కెట్ లో ముందే ఆర్డర్ లు అందుతున్నాయని తెలుస్తుంది.. మార్కెట్ లో విడుదల కాకముందే డిమాండ్ పెరిగింది..